రష్మిక ప్లేస్‌ లో రాశీ ఖన్నా..?

హైదరాబాద్ : మలయాళ స్టార్‌ దుల్కర్ సల్మాన్ ‌ హీరోగా ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’ లాంటి మనసుని హత్తుకొనే చిత్రాలను తీసిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడికల్‌ లవ్‌ స్టోరీలో దుల్కర్ ‌ కి జోడీగా స్టార్‌ హీరోయిన్లు పూజాహెగ్డే – రష్మిక మందన్న నటిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా హీరోయిన్‌ విషయంలో మరో న్యూస్‌ వస్తోంది. ఇందులో రష్మిక ప్లేస్‌ లో రాశీఖన్నాని తీసుకున్నారట. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌ తో రష్మిక బిజీగా ఉండటంతో ఆమె ఈ చిత్రానికి డేట్స్‌ కేటాయించలేకపోయిందట. దీంతో ఆ పాత్రకు రాశీ ఖన్నా ను తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. గతేడాది ‘వెంకీమామ’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న రాశీ ఖన్నా.. ప్రస్తుతం ‘తుగ్లక్‌ దర్బార్‌’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది.

ఇప్పుడు తెలుగు తమిళం మలయాళ భాషల్లో రూపొందే ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసిందని అంటున్నారు. కాగా 1964 బ్యాక్‌ డ్రాప్‌ లో పీరియాడికల్‌ వ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్ ‌ సల్మాన్‌ కనిపించనున్నారు. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేలా షూటింగ్‌ జరపాలని మేకర్స్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *