మూగతండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్

హైదరాబాద్ : నటుడు రాజేంద్రప్రసాద్‌ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తారు. తాజాగా ఓ సినిమాలో ఆయన మూగ తండ్రిగా కనిపిస్తున్నారు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సమర్పణలో గాలి సంపత్‌ సినిమా తెర కెక్కుతున్న విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం పూజాకార్యక్రమాలు జరుపుకుంది. తండ్రీకొడుకు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు, నటకిరీటి రాజేందప్రసాద్‌ నటిస్తున్నారు. తన కామెడీతో, నటనతో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ కంటతడి పెట్టించగల నటుడు రాజేందప్రసాద్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్‌ లో ఆయన చేసిన చాలా పాత్రలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా వస్తున్న గాలి సంపత్‌ చిత్రంలో టైటిల్‌ రోల్‌ ను రాజేందప్రసాద్‌ పోషిస్తున్నారట. ఆసక్తికర విషయమేంటంటే ఈ మూవీలో రాజేందప్రసాద్‌ మూగ తండ్రి పాత్రలో కనిపించనున్నాడని టాక్‌. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ ప్లే, క్రియేటివ్‌ వర్క్‌ పనులు కూడా చూసుకుంటున్నాడు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *