పీ.ఎ.ఏసీ.ఎస్. గోదాం నిర్మాణం కోసం వినతిపత్రం అందచేత

కడ్తాల్ (రంగారెడ్డి) (ప్రజాజ్యోతి) : మల్టీ సర్వీసెస్ సెంటర్ స్కీం క్రింద టి.ఎస్.కాబ్ ద్వారా ఆమనగల్లు పీ.ఎ.ఏసీ.ఎస్. నుంచి కడ్తాల్ పీ.ఎ.ఏసీ.ఎస్. గోదాము (గిడ్డంగి) నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది అని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ ఆమనగల్లు కడ్తాల్ మండలాల పీ.ఎ.ఏసీ.ఎస్. చైర్మన్ గంప వెంకటేష్ గుప్త పెర్కొన్నారు. గోదాం నిర్మాణం కోసం 2వేల నుంచి 4వేల గజాల స్థలం కావాలని శనివారం జరిగిన గ్రామ సభలో కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహారెడ్డి వైస్ ఎంపీపీ ఆనంద్ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి హరీష్ గారికి రైతులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, డైరెక్టర్ సేవ్య నాయకులు జహంగీర్ అలీ, అశోక్, మహేష్, భిక్షపతి, రైతులు రాములు, వెంకట్ రెడ్డి, పాండు, రాములు, గణేష్, వెంకటయ్య, లయక్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *