నేటినుంచి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాల తీరుగానే ..కొవిడ్‌ కారణంగా ఉత్సవాలను టీటీడీ ఈ ఏడు ఏకాంతంగా నిర్వహిస్తోంది. తొమ్మిది రోజులపాటు అమ్మవారి ఆలయం వెలుపల ఉన్న వాహన మండపంలో చిన్నశేష వాహనం నుంచి చక్రస్నానం వరకు నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆలయ ముఖద్వారం నుంచి రెండో గేటు వద్ద ఉన్నలడ్డు కౌంటర్‌ వరకు పైన ఇనుప రేకులు , రెండువైపులా ఏర్పాటు చేశారు. టీటీడీ అధికారులు , పాలకమండలి సభ్యులు , అర్చకులు , ఇతర ప్రొటోకాల్‌ అధికారులకు మాత్రమే ఉత్సవాలను తికించడానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్ర్నకుంకుమార్చన సేవ జరగనుంది. దీన్ని ఈ ఏడాది ఆన్‌లైన్‌ సేవగా టీటీడీ పరిగణించింది. దాంతో ఈ టికెట్‌ పొందిన భక్తులు ఎస్వీబీసీ ద్వారా వీక్షిస్తూ ఈ సేవలో పాల్గొనవచ్చు. బుధవారం ఉదయం 9.30 గంటకు ధనుర్ ‌లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి ఏర్పాట్లు పరిశీలించి, సిబ్బందికి సూచనలను ఇచ్చారు.

ఇదిలావుంటే తిరుమలతోపాటు దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహిస్తున్న వేద పాఠశాలను తిరుపతి లోని వేదిక్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావలని ఈవో జవహర్‌రెడ్డి ఆదేశించారు.ప్రధానంగా.. ’టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌ నిర్వహించే కార్యక్రమాలను కూడా ఇకపై ఎస్వీబీసీలో టెలికాస్ట్‌ చేయాలి. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా భగవద్గీతను ఎస్వీబీసీ రూపొందించాలి. శ్రీవారి భక్తులను మోసం చేసే నకిలీ వెబ్‌సైట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుమ, తిరుపతిలోని టీటీడీ భవనాలపై సౌర విద్యుత్‌ ఉత్పిత్తిచేసి, వినియోగించుకోవాలి. పురాణాల్లో పేర్కొన్న పవిత్రమైన మొక్కతో తిరుమలలో ప్రత్యేకమైన ఉద్యానవనాన్ని అభివృద్ధి చేసి, వాటిని శ్రీవారికి వినియోగించాలి. స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రుల్లో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ తీసుకురావాలి. సరళమైన భాషలో టీటీడీ పుస్తకాలను ప్రచురించాలి.సికింద్రాబాద్‌లోని సంస్కృత కళాశాలకు పూర్వవైభవం తేవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *