తెరుచుకున్న జూపార్క్‌.. మొదలైన తాకిడి

హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూసి వేసిన నెహ్రూ జులాజికల్‌పార్క్‌ ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సందర్శకుల కోసం తిరిగి తెరుచుకుంది. దీంతో సందర్శకులు ఉత్సాహంగా వచ్చారు. తమ పిల్లాపాపలతో మాస్కు ధరించి వారు సందర్శించారు. నెలల తరబడి మూసి ఉంచడం తో జంతువులను సందర్శించాలనుకునే వారికి కాస్త ఇబ్బందిగానే మారింది. అయితే ఐదో విడత కోవిడ్‌ నిబంధనల సడలింపులో భాగంగా జూపార్క్‌ను తిరిగి తెరిచినట్టు జూపార్క్‌ డైరెక్టర్‌ డా. సిద్దానంద్‌కుక్రేటి తెలిపారు. కొవిడ్‌ నిబంధనను ఖచ్చితంగా పాటిస్తూ సందర్శకును అనుమతి స్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సందర్శకులను ప్రవేశ ద్వారాల వద్దనే థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించడం, మాస్క్‌ ధరించడం తప్పని సరిచేసినట్టు తెలిపారు.

జూపార్క్‌లోని వివిధ ప్రదేశాల్లో 40 శానిటరీ డిస్పెన్సర్స్‌ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. అలాగే మరుగుదొడ్లు, టాయిలెట్‌లో శానిటై జర్లతో పాటు సబ్బును ఏర్పాటుచేసినట్టు తెలిపారు. 50శాతం సీట్ల నిర్వహణతో జూపార్కులో బ్యాటరీతో నడిచే వాహనాలు, ట్రెయిన్‌లో నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కొవిడ్‌ నిబంధలను ఖచ్చితంగా పాటించాలని కోరుతూ జూపార్క్‌లోని అన్ని ప్రాంతాల్లో సైన్‌బోర్డు లను ఏర్పాటుచేసి సందర్శకులను చైతన్యం చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటుండంతో పెద్దసంఖ్యలో సందర్శకులు వస్తున్నట్టు జూపార్క్‌ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *