రెండవరోజు బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు.. ..

విజయవాడ : శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైన శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాలు గొప్పది. ముఖ్యమైనది. అందుకే విద్యోపాసనకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొంది తేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ క్రమంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కరోనా మార్గదర్శకాలకనుగుణంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు దేవస్థానం అధికారులు కల్పించే ఏర్పాట్లకు భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు పూర్ణ ఫలం అందించే శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి భక్తులకు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలను కలుగజేయాలని ఆలయ ఇవో ఎం.వి. సురేష్ బాబు, దేవస్థానం కమిటీ చైర్మన్ పైలా సోమినాయుడు ఆకాంక్షించారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *