కళగానే మారిన నిర్మల్‌ రైల్వే లైన్‌ : ఎంపి సోయంపైనే ఆశలు

నిర్మల్‌ : దశాబ్దాల నుంచి నిర్మల్‌ జిల్లా కేంద్ర ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే లైన్‌ నిర్మాణం కళగానే మిగిలిపోతోంది. దీంతో తాజాగా ఆదిలాబాద్‌ బిజెపి ఎంపి సోయం బాపూరావు రంగంలోకి దిగారు. మరోమారు దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకుని వెళతానని హావిూ ఇచ్చారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం దాదాపు రూ. 5 కోట్ల వ్యయంతో సర్వే చేపట్టింది. దాదాపు 119 కిలో విూటర్ల పొడవుతో నిర్మించాల్సిన పనుల వ్యవహారం అప్పట్లో సర్వేకే పరిమితమయ్యింది. కేంద్ర రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు అప్పటి సర్కారుకు నివేదించిన సర్వే ప్రతిపాదను మరుగున పడిపోయాయి. దీనిపై సోయం బాపురావు సైతం స్పందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఈ నిర్మాణం పట్ల సుముఖంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. సంప్రదింపు పక్రియ సక్సెస్‌ అయితే పార్లమెంట్‌ శీతకాల సమావేశాల సందర్భంగా నిధులకు సంబంధించిన ప్రకటన వెలు వడే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

స్థానికులు రైల్వే లైన్‌ నిర్మా ణానికి డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అ ప్పట్లో దీని వైపు దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించక పోవడంతో సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి ఆర్మూర్‌ టూ ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌పై చర్యలు తీసుకుంటామంటూ హావిూనిచ్చారు. అవసరమైతే నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా ఇస్తామని ప్రకటించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం సైతం నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల నుంచి ఈ నిర్మాణం కోసం నయా పైసా కూడా తన వాటాగా కేంద్రానికి చెల్లించక పోవడంతో ఈ వ్యవహారం మూలన పడిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో జిల్లాకు చెందిన ఎంపీ సోయం బాపురావు మళ్లీ ఆర్మూర్‌ టూ ఆదిలాబాద్‌ వయా నిర్మల్‌ రైల్వే లైన్‌ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. సోయం బాపురావు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే పనులకు మోక్షం లభించే అవకాశం ఉంది.

తెంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఆర్మూర్‌ టూ ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి హావిూనివ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు వెనకాడినట్లయితే సగం నిధులు తాము భరిస్తామంటూ ప్రకటించింది. ఎన్నిక సమయంలో బీజేపీ తరపున తానిచ్చిన హావిూకి కట్టుబడి ఉండేందు కోసం ఎంపీ సోయం బాపురావు మరుగున పడ్డ ఆర్మూర్‌ టూ ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే మూడుసార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఈ విషయమై జ్ఞాపకం చేశారు. అటు కేంద్ర రైల్వే శాఖ మంత్రితో పాటు ఇటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో కూడా సంప్రదింపు జరుపుతూ ఎలాగైనా బడ్జెట్‌లో దీని కోసం నిధులు కేటాయిం చేట్లు చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ విూదుగా ఆదిలాబాద్‌ వరకు 119 కిలో విూటర్ల పొడవుతో రైల్వే లైన్‌ నిర్మించినట్లయితే ఈ ప్రాంతమంతా పెద్ద ఎత్తున అభివృద్ధికి నోచుకునే అవకాశాలు ఉన్నాయి. రైల్వేలైన్‌ సౌకర్యం లేని కారణంగా ఈ ప్రాంతంలో ఒక్క భారీ పరిశ్రమ కూడా ఏర్పా టు కావడం లేదు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *