నీహారిక పెళ్లి సందడి

హైదరాబాద్ : మెగా బ్రదర్, నటుడు నాగబాబు ముద్దుల కుమార్తె కొణిదె నిహారిక పెళ్లి సందడి హుషారుగా సాగుతోంది. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. రాజస్తాన్ ఉదయపూర్లోగల ఉదయ్ విలాస్ ఈ వేడుకకు వేదిక కానుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు , సన్నిహితులు ఉదయ్పూర్కు చేరుకొని ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా కొడుకు అకిరా నందన్తో కలిసి ఉదయ్పూర్ చేరుకున్నారు. నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోలు అందరూ సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరుగా కనిపించే హీరోలంతా ఒక్కచోట చేరడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా మెహందీ, హల్దీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాబోయే వధువరులిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకకు చెందిన ఫోటోలు సోషల్ విూడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటితో పాటు హైదరాబాద్లోని నివాసంలో పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను నాగబాబు తన య్యూట్యూబ్ ఛానల్లో షేర్చేశారు. ఇదిలా ఉండగా సోమవారం నాటి సంగీత్ కార్యక్రమంలో వధూవరులు , మెగా హీరోల డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్లోనూ ఆ జోష్ కొనసాగించారు. ఇక మెహందీ ఫంక్షన్ సందర్భంగా మెగాస్టార్ బ్లాక్ బ్లస్టర్ ’ఘరానా మొగుడు’ చిత్రంలోని ’బంగారు కోడి పెట్ట’ పాటకు చిరు, అల్లు అర్జున్ స్టెప్పులు వేశారు. అదే పాటకు చిరు భార్య సురేఖ, అల్లు అరవింద్ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *