Narendra-Modi-Tweet-on-Ramzan-Mubarak-రంజాన్-పండుగ-శుభాకాంక్షలు

ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు : మోడీ

ముస్లిం ప్రజలు అత్యంత పవిత్రమైన పండుగ గా భావించే రంజాన్ పండుగ యొక్క రంజాన్ ఉపవాసాలు ఈ నెల 25వ తేది శనివారం రోజు నాటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభం అవ్వనున్నాయి. ఈ రంజాన్ నెల ప్రారంభం కావడానికి శుభ సుచికంగా ముస్లిం ప్రజలు నమ్ముకునే నెల వంక శుక్రవారం రోజున కనిపించటం వలన రంజాన్ పండుగ కన్నా ఒక నెల రోజుల ముందు నుండి పాటించే రంజాన్ నెల ఉపవాసాలను ప్రరంబిస్తున్నారు. దీనికి సంబంధించి భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరి సోధరిమనులందరికీ రంజాన్ నెల ప్రరంభోస్తావం యొక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ విధంగా రంజాన్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియచేసిన మోడీ గారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్న అని ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఈ రంజాన్ నెల లో ప్రతి ఒక్కరికి సామరస్యం తో పాటుగా దయ మరియు కరుణ కూడా ఏళ్ల వేళలా ఉండాలని నేను మనసార కోరుకుంటున్న అని ప్రధాని నేరేంద్ర మోడీ తెలిపారు.

Read More From PrajaJyothi News : శ్రీకాళహస్తి కట్టడి కోసం అతి కఠిన నిబంధనలు

Narendra Modi Tweet on Ramzan Mubarak రంజాన్ పండుగ శుభాకాంక్షలు
Narendra Modi Tweet on Ramzan Mubarak రంజాన్ పండుగ శుభాకాంక్షలు

Read More From PrajaJyothi News : తిరుమలలో రెండు వారాలు శ్రీవారి దర్శనం రద్దు

ప్రజలందరు మరింత ఆరోగ్య వంతులుగా మారాలి

ప్రస్తుతం ప్రపంచాన్ని గజ గజ వణికిస్తు అల్లా కల్లోలం చేస్తున్న ఈ అతి ప్రమాద కరమైన కరోనా వైరస్ మహమ్మారి పై ప్రపంచ దేశాల యొక్క అన్ని ప్రభుత్వాలు కలిసి కట్టుగా చేస్తున్న ఈ ప్రయత్నం విజయం సాదించాలని భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలుపుతూ, భారత దేశ ప్రజలతో పాటుగా ప్రపంచ దేశాలలో నివసించే ప్రతి ఒక్క మనిషి ఈ కరోనా వ్యాధి నుండి బయటపడి మరింత ఆరోగ్య వంతులుగా మారాలని తన ఆశ భావాలను పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటె శుక్రవారం రోజున సంధ్య వేళలో భారతదేశం లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన లక్నో నగరం లోని షియా మరియు సున్ని కమిటీలు రంజాన్ నెల ప్రారంభ సూచకంగా తెలిపే రంజాన్ నెల వంక ను స్పష్టం చేస్తూ ఈద్ యొక్క ఉపవాసాలను ప్రారంభించవచ్చు అని పేర్కొన్నాయి.

Read More From PrajaJyothi News : పూజా సమయం లో పువ్వులను వాడటానికి కారణం ఏమిటి ?

రంజాన్ పండుగ కోసం రంజాన్ ఉపవాసాలు ప్రారంభం

ఈ నేపధ్యంలో భారత దేశంలో నేటి నుండి అనగా శనివారం రోజు నుండి ముస్లిం ప్రజలు ఆరాధ్యంగా భావించే రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అవుతున్నాయి. ఇలా ప్రపంచంలోని వివిధ దేశాలలో గల ముస్లిం ప్రజలు అందరు కూడా ఈద్ ను పురస్కరించుకొని ఒక నెల రోజుల నుండి చేసే రంజాన్ మాసం యొక్క ఉపవాసాలను ఈ రంజాన్ మాసం లో ఉదయం జాము నుండి మొదలు పెడితే సంధ్య కాలం పోయే వరకి పచ్చి మంచి నీరు కూడా తాగకుండా కటోర ఉపవాసాన్ని పాటిస్తూ తమ భక్తి భావాలను అల్లా కి తెలుపుతారు.

Read More From PrajaJyothi News : PrajaJyothi News Daily E-Paper PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *