నరసింహపురం పెద్ద హిట్‌ కావాలి : శ్రీకాంత్

హైదరాబాద్ : పలు సీరియల్స్‌, సినిమాల ద్వారా సుపరిచితుడైన నంద కిశోర్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ’నరసింహపురం’ సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని నటుడు శ్రీకాంత్‌ కోరుకున్నాడు. మోషన్‌ పోస్టర్‌ చాలా బావుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చక్కగా ఉందని హీరో శ్రీకాంత్‌ కితాబునిచ్చారు. ’నరసింహపురం’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్‌ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. శ్రీరాజ్‌ బళ్ళా దర్శకత్వంలో.. గీత్‌ గౌరవ్‌ సినిమాస్‌ పతాకంపై పి.ఆర్‌.క్రియేషన్స్‌ సమర్పణలో శ్రీరాజ్‌ బళ్ళా, టి.ఫణిరాజ్‌ గౌడ్‌, నందకిశోర్‌ ధూళిపా సయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం ’నరసింహపురం’. నందకిశోర్‌ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్‌గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలి పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పతాక సన్నివేశా చిత్రీకరణలో ఉంది. హీరో నందు మాట్లాడుతూ ’ఒకటిన్నర సంవత్సరంగా మేమంతా పడుతున్న కష్టానికి ప్రతిఫమే ’నరసింహపురం’. డైరెక్టర్‌ శ్రీరాజ్‌ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని అన్నారు. ఈ వారం చిత్రీకరించే క్లైమాక్స్‌ చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుందని అన్నారు డైరెక్టర్‌ శ్రీరాజ్‌ బళ్ళా. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని నిర్మాత తెలిపారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *