Naga Babu Tweet on Tirumala Tirupati Devasthanam Assets నాగబాబు

సంచలనాత్మక ట్వీట్లు చేస్తున్న నాగబాబు

పలు తెలుగు చిత్రాలలో నటిస్తూ మెప్పు పొందిన నాగబాబు మెగాస్టార్ కి తమ్ముడిలా మాత్రమే ఉండకుండా అటు పవర్ స్టార్ట్ కి అన్నయ్య లా కూడా భాద్యత వహిస్తూ పవన్ కళ్యాణ్ స్థాపితం చేసిన జనసేన పార్టీ కి నాయకత్వం వహిస్తూ బేష్ అనిపించుకుంటున్నాడు. ఇక సినీ రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసి గత కొంత కాలంగా టెలివిజన్ లో ప్రసారం అయ్యే పలు రకాల వినోదాత్మకమైన కార్యక్రమాలలో నటిస్తూ అలరిస్తున్నాడు. అయితే ఈ మధ్యనే నాతురం గాడ్సే పై ట్వీట్ చేసిన నాగబాబు గారు ఇప్పుడు మళ్లీ మరో ఆసక్తికరమైన ట్వీట్ ను పోస్ట్ చేసారు.

Read More From PrajaJyothi News : నేను చేసిన పెద్ద తప్పు అదొక్కటే : రష్మీ గౌతమ్

Naga Babu Tweet on Tirumala Tirupati Devasthanam Assets నాగబాబు
Naga Babu Tweet on Tirumala Tirupati Devasthanam Assets నాగబాబు

Read More From PrajaJyothi News : విక్రం కోబ్రా సినిమా కోసం తమిళనాడులో మరో రష్యా

తిరుపతి లోని శ్రీ వారి ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు

ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన మహోన్నతమైన పుణ్య క్షేత్రం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామీ యొక్క సన్నిధానం తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఈ తిరుమల తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర స్వామీ వారికి చెందిన వేల కట్టలేని ఆస్తులను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మడానికి సిద్ధమైందని నాగబాబు గారు మండిపడుతున్నారు. పూర్తిగా కథనం లోకి వెళితే, తిరుమల తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర స్వామీ వారికి చెందిన ఆపారమైన ఆస్తులను భాద్యతతో కాపాడుతూ సంరక్షించాల్సిన భాద్యతలు తిరుమల తిరుపతి పాలక మండల వ్యవస్థది అని నాగబాబు గారు అంటూ, ఆ వెంకటేశ్వరుడి యొక్క ఆస్తులను భూములను అమ్ముకుని తినే హక్కు అధికారం మీకు అసలు ఏ మాత్రం కూడా లేవని అన్నారు. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నాగబాబు గారు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా హిందువుల యొక్క మనోభావాలను దేబ్బతియకండి. మీరు తీసుకున్న పిచ్చి పట్టిన నిర్ణయాలను వీలైనంత తొందరలో వెనక్కి తీసుకోండి అని నాగబాబు గారు డిమాండ్ చేసారు.

Read More From PrajaJyothi News : బాలీవుడ్‌ నటి ఊర్వశి రూటేలా మనసు కూడా అందమే!

ఆస్తులను అమ్మితే ఖచ్చితంగా అడ్డుపడతం

దేశ వ్యాప్తంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానం లోని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను అమ్ముకునే నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం అని నాగబాబు గారు ఖరాఖండిగా తెలిపారు. ఈ నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాత్ర అనేది కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి ఆలయం యొక్క ధర్మ కర్త గా మాత్రమే అమ్ముకునే హక్కు ముమ్మాటికి లేదు అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన శ్రీ వారి ఆస్తుల యొక్క వేలం పాటను స్వయంగా వెనుకకి తీసుకొని భారత దేశం తో పాటు ప్రపంచం లోని నలుమూలల నివసిస్తున్న హిందూ బంధువుల యొక్క ఆధ్యాత్మిక భావనలను ఇలాంటి సిగ్గు చేటు పనులు చేస్తూ కించపరచకుండా ఉండాలని తెలిపారు.

Read More From PrajaJyothi News : PrajaJyothi News Today E-Paper in PDF

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *