ఎంపీటీసీ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులుగా ఎర్రబెల్లి రవీందర్ రావు ఎన్నిక

జయశంకర్ భూపాలపల్లి (రేగొండ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎంపీటీసీ ల ఫోరంజిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన ఎర్రబెల్లి రవీందర్ రావు ను సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు మండల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తనపై పెట్టిన నమ్మకాన్నీ నిలబేట్టుకుంటానని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుణ్ణం లక్ష్మి, రవి, జడ్పీటీసీ సాయిని విజయ – ముత్యం, టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మోడెమ్ ఉమేష్ గౌడ్, ఎంపీపీ పుణ్ణం లక్ష్మీ- రవి, రేగొండ ఎంపీటీసీ మైస సుమలత, భిక్షపతి, మాజీ ఎంపీపీ ఈర్ల సదానందం, లెంకల శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ అబ్దుల్ రహీం, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *