కబ్జాలకు కేరాఫ్​ అడ్రస్​గా ఎమ్మెల్యే జింఎఆర్​ : మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​ గౌడ్​

సంగారెడ్డి (పటాన్​ చెరు) : పటాన్​ చెరు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నాయకులు నందీశ్వర్​ గౌడ్​ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కబ్జాదారుడిగా మారిపోయాడని ఆరోపించారు. చెరువులు, కుంటలను కూడా వదలడం లేదని, రియల్​ ఎస్టేట్​ వ్యాపారులను భయబ్రాంతులకు గురి చేసి, వారి వద్ద డబ్బులు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. సర్వే నెంబర్​ 987, 988లలో ఉన్న 3ఎకరాల భూమి విలువ 30 కోట్లని, దీనిని ఎమ్మెల్యే కబ్జా చేయడం దారుణమన్నారు. అంతేకాకుండా సర్వే నెంబర్​ 620లో ఉన్న 8 ఎకరాల ఎఫ్​టిఎల్​ భూమిని కూడా ఎమ్మెల్యే ఆక్రమించుకోవడం సిగ్గు చేటని తెలిపారు. చెరువులను ఈ విధంగా ఆక్రమిస్తే వరదలు వచ్చినప్పుడు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్​ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు టిఆర్​ఎస్​ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహిస్తూ ఎక్కడి భూములు అక్కడ ఆక్రమిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే వారిని ట్రాన్స్​ఫర్​ చేస్తామని బెదిరిస్తున్నారని, కొందరు ఎమ్మెల్యేలు, టిఆర్​ఎస్​ నాయకులు చేస్తున్న ఈ కబ్జా వ్యాపారంలో కేటీఆర్​, హరీష్​ రావులు కూడా పార్టర్న్​లని. ఎమ్మెల్యే గూడెం అక్రమంగా నిర్మిస్తున్న బిల్డర్ తో అన్నారని, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​ గౌడ్​ విమర్శలు సంధించారు.

ఒక్కప్పుడు పటాన్​ చెరు ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసని, దీనిని ఆయన మరిచిపోకూడదని అన్నారు. డబ్బుతో అహంకారం పెరిగిన ఎమ్మెల్యే జిఎంఆర్​ పతనం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్న ఎమ్మెల్యే వాటిని ఏమి చేసుకుంటాడో అర్థం కావడం లేదన్నారు. దేనికైనా ఎంతో కొంత తృప్తి ఉండాలని, ఎమ్మెల్యే గూడెంకు అది లేదన్నారు. పదవులు శాశ్వితం కాదని, ప్రజలతో మంచిగా ఉండటం ఎమ్మెల్యే నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజస్వామ్యంలో ఉద్దండులైన రాజకీయ నేతలు ఇందిరా గాంధీ, ఎన్టీఆర్​ లాంటి వారికే ఓటమి తప్పదని, ఎమ్మెల్యే గూడెం వారితో పోలిస్తే ఎంత అని నందీశ్వర్​ గౌడ్​ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మారాలని, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రజలకు మంచి చేయాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పార్టీలతో సంబంధం లేకుండా పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకోసం 7993464308 నెంబర్​కు ఫోన్​ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. 24గంటల పాటూ ఈ నెంబర్​ అందుబాటులో ఉంటుందని నందీశ్వర్​ గౌడ్​ స్పష్టం చేశారు

మీడియాలో వస్తేకానీ నీవు స్పందించవా ఎమ్మెల్యే!
ఇసుకుబావి వద్ద వరద కారణంగా ఓవ్యక్తి గల్లంతయితే, ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమని నందీశ్వర్​ గౌడ్​ మండిపడ్డారు. ఈ విషయం మీడియాలో వచ్చిన తరువాత ఎమ్మెల్యే అక్కడకు వచ్చి పరిస్థితిని తెలుసుకోవడం ఏమిటన్నారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు అంటే గూడెంకు లెక్కలేదని ఎద్దేవ చేశారు. ఇసుక బావి వద్ద కల్వర్టును నిర్లక్ష్యం చేయడం వల్లే ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడని, రాష్ట్రమంతా ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని చూసిందన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే వల్ల కేసీఆర్​కు, టిఆర్​ఎస్​ పార్టీకి మేలు జరగదని తెలిపారు. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్​ ప్రభుత్వానికి గూడెం వంటి ఓ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల ఏమి కాదని, ఇంతటి దారుణమైన ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కేసీఆర్​ వెంటనే డిస్మస్​ చేయాలని డిమాండ్​ చేశారు. పటాన్​ చెరు నియోజకవర్గంలో భూ దందాలు చేస్తూ, టిఆర్​ఎస్​ నేతలే సిగ్గుపడేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్టీని అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదిస్తూ, ఇటు ప్రజలను అటు పార్టీ అధినాయకత్వాన్ని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి మోసం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పందించి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డిని వెంటనే పదవిని నుంచి బర్త్​ రఫ్​ చేసి, ఆయనపై ఎక్వైరీ కమిటి వేయాలని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​ గౌడ్​ డిమాండ్​ చేశారు.

ముందస్థు చర్యలు చేపడ్డంలో ప్రభుత్వం విఫలం!
వరదల కారణంగా హైదరాబాద్​లోని అనేక ప్రాంతాలతో పాటూ ఓల్డ్​ సిటిలో వరద నీరు వచ్చి, అనేక మంది చనిపోయారని, దీనిని నివారించేందుకు ప్రభుత్వం ముందస్థు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు అంటే విలువ లేకుండా వ్యవహరిస్తుందని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్​కు సమజసం కాదని అన్నారు. అదే కేసీఆర్​ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి పరిస్థితి వస్తే ఇలానే ఉంటారా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే వరదల కారణంగా చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గిదె రాజు రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ సతీష్ గౌడ్ జిల్లా ప్రధాన మహేందర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ సాధన కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్త జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ జిల్లా నాయకులు అంక గళ్ళ సహదేవ్ జిన్నారం మండల అధ్యక్షులు శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు .

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *