నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : జిల్లాలో ఇటీవలే విస్తారంగా కురిసిన వర్షాలవల్ల రఘునాథపాలెం మండలంలో దెబ్బతిన్న మిర్చి పంటను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణతో కలిసి పరిశీలించారు ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, కోటపాడు గ్రామాలలో మిర్చి పంట దెబ్బతిన్న రైతులతో మంత్రి మాట్లాడారు. మిర్చినారు అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పంటనష్టం సమగ్రనివేదికను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. అనంతరం రఘునాధపాలెం రైతు వేదిక, భూసార పరీక్షా కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ఇప్పటికే పూర్తయిన రైతువేదికతోపాటు భూసార, విత్తన పరిశోధన కేంద్రంలో రైతులకు అందించనున్న సేవల వివరాలను తెలుసుకొని రైతులకు పూర్తి స్థాయిలో అవసరమైన వసతులు, ఏర్పాట్లు భూసార పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *