లాక్‌డౌన్‌ మినహాయింపు

వీటికి మాత్రమే లాక్‌డౌన్‌ మినహాయింపు : కేంద్రం

లాక్‌డౌన్‌ మినహాయింపు
లాక్‌డౌన్‌ మినహాయింపు

PrajaJyothi News : దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో ఏర్పడిన లాక్‌డౌన్‌ దాదాపు అన్ని రంగాలను మూయించేసి ఇంట్లో కుర్చ్చోపెట్టింది. మేలి మెల్లిగా ఒక్కో రంగాన్ని ఈ లాక్‌డౌన్‌ మినహాయింపు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇంకొన్ని వ్యాపార రంగాలకి కూడా ఈ లాక్‌డౌన్ యొక్క తొలగింపు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం నాడు ఓ ప్రకటన తో కేంద్రం తెలియచేసింది. అయితే కొన్ని రోజుల క్రితం ఆమోదించిన లాక్‌డౌన్‌ ఎత్తివేతకి ఈ మినహాయింపులు కూడా కలిసి కాస్త అదనముగా ఉంటాయి అని కేంద్రం తెలిపింది. దేశంలోని మారు మూల ప్రాంతాలలో నిర్మాణానికి సంభందించిన పనులు, నీటి యొక్క సరఫరా , పారిశుద్యం యొక్క నిర్మాణ కార్యక్రమాలు మొదలగు రంగాలకు ఇప్పుడు లాక్‌డౌన్‌ నుండి విముక్తి చేస్తూ అనుమతులను జారి చేసారు. కలప కి సంబంధం లేకుండా అటవీ నుండి ఉత్పత్తి అయ్యే వస్తువుల తయారి, కొనుగోలులకి కూడా ఆమోదం తెలిపారు. పల్లె ప్రాంతాలలో నిర్మాణం పనులలలో విద్యుత్ పోల్స్, కరెంటు లైన్లు, ఇంటర్నెట్ పైబరు అప్టికాల్ కేబుల్స్ యొక్క ఏర్పటు మొదలైనవే కాకుండా హోం పైనాన్స్, మైక్రో పైనాన్స్ సంస్థలు కూడా కొంత మంది సిబ్బంది తో తమ కార్య కాలాపాలకి కూడా లాక్‌డౌన్‌ ని తీసి వేయాలని ప్రకటించింది.

Click Here to Read Our PrajaJyothi News E-Paper

Share The News On
One thought on “ఈ రంగాలకు కూడా లాక్‌డౌన్‌ మినహాయింపు చేసిన కేంద్రం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *