ఆదిపురుష్‌ సీతగా కృతి సనోన్

ముంబాయి : ఇప్పటికే ఆదిపురుష్‌ రామాయణంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. దీనిలో రాముడిగా ప్రభాస్‌ నటిస్తున్నారు. సీత ఎవరన్నది ఇంతకాలం చర్చ సాగుతోంది. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందిస్తున్న చిత్రం ’ఆదిపురుష్‌’. ఆదికావ్యం ’రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌, రావణుడిగా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. అయితే లక్ష్మణుడు, సీత పాత్ర గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. సీత పాత్రకు పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించిన ఓం రౌత్‌ చివరకు కృతి సనోన్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈమె గతంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ సరసన ’వన్‌: నేనొక్కడినే’, నాగచైతన్య సరసన ’దోచేయ్‌’ సినిమాల్లో నటించింది. కృతినే సీతగా ఫైనల్‌ చేసినట్టు జాతీయ విూడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే లక్ష్మణుడి పాత్రకు బాలీవుడ్‌ నటుడు సన్నీ సింగ్‌ని తీసుకోబోతున్నారట. ఈ సినిమాను 3డి, 2డిలో టీ సిరీస్‌ సంస్థ అత్యంత భారీ బ్జడెట్‌తో నిర్మిస్తోంది.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *