సీపీఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన

జయశంకర్ భూపాలపల్లి (రేగొండ) : భారత కమ్యూనిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన సందర్శన కార్యక్రమంలో భాగంగా రేగొండ మండల గ్రామాలైన చిన్నకోడెపక, జూబ్లీనగర్ గ్రామాలను సీపీఐ మండల కార్యదర్శి అన్నారపు రాజేందర్ ఆధ్వర్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ జిల్లా సమితి సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నకోడెపక గ్రామములో బేస్ మెట్ లెవెల్ ఆగిపోయాయని, వీటికి కావలిసిన ఐరన్, సిమెంట్, వచ్చి తుప్పు పడుతున్నాయని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు. లేని యేడల డబల్ బెడ్రూం లబ్దిదారులతో కలెక్టరేట్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటి చంద్రమౌళి, కుడుదుల వెంకటేష్,రవీందర్, చక్రపు అగయ్య, పైల్లా ఓంకార్,ఏఐటీయూసీ నాయకుడు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *