నల్ల చట్టాల ద్వారా 80కోట్ల రైతులకు అన్యాయం : రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ (అచ్చంపేట) : రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాల ద్వారా 80 కోట్ల రైతులను ప్రైవేటు కంపెనీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాకట్టు పెట్టడం జరుగుతుందని రైతులను నట్టేట ముంచే అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల చట్టాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ ఎనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాలను విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని ఆదివారం జరిగిన రాజిజ్ రైతు భరోసా దీక్షకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూర్చున్నారు అనంతరం రేవంత్ రెడ్డి రైతుదీక్ష ఉద్దేశించి మాట్లాడారు ప్రజల అభిమతం మేరకు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రస్థాయిలో ఎదిగి మీ ముందు నిలబడ్డానని మీకోసం ప్రాణాలైనా పందెంగా పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ రాజ్యం లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కమిషన్ చట్టం తీసుకురావడం జరిగిందని అన్నారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పేదలకు ఇందిరమ్మ రాజ్యం లో లో కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రస్తుతము నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకు వచ్చి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలకు రైతులను తాకట్టు పెట్టడం జరుగుతుందన్నారు రైతాంగం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి ఇ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు కేంద్ర రాష్ట్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే రైతులు పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని రైతుల కోసం పని చేస్తున్న ప్రభుత్వాలు ఈ విధమైన చట్టాలను తీసుకు వచ్చి రైతుల నడ్డివిరిచే విధంగా చేస్తున్నారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది బలిదానం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ కుటుంబాన్ని కూడా న్యాయం చేయలేదని యువకులకు ఉద్యోగాలు ఉద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం నెరవేర్చ లేదన్నారు.

సభకు హాజరైన రైతులు

అచ్చంపేట పట్టణంలో సిద్దిపేట గా మారుస్తామని అన్న ఎమ్మెల్యే ఏ ఒక్క హామీ నెరవేరలేదు అన్నారు. దీంతోపాటు అచ్చంపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లోడాక్టర్లు సిబ్బంది లేక వైద్యసేవలు ప్రజలకు అందడం లేదన్నారురైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈరోజు నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు రైతు భరోసా యాత్ర కూడా ప్రారంభిస్తామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు అంతకుముందు రేవంత్ రెడ్డి ఎద్దుల బండి పై పట్టణములో తిరుగుతూ ప్రజల అభిమానం తెలుపుతూ రైతు దీక్ష వద్దకు చేరుకున్నారు అశేష జనం మధ్య రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాకవి ఏపూరి సోమన్న ఆటపాటలతో ప్రజలను రైతులను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సీతక్క విజయరామరాజు మాజీ ఎంపీ మల్లు రవి యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి వివిధ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్ పి టి సి లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *