భారత్‌ అత్యంత శక్తివంతమైన దేశంగా ఉండాలి : మంత్రి కిషన్‌ రెడ్డి

తిరుమల : ప్రపంచంలో భారత్‌ అత్యంత శక్తి వంతమైన దేశంగా తయారయ్యే శక్తి ప్రసాదించాలని, చైనా, పాకిస్తాన్‌ దేశ సరిహద్దుల్లో నెల కొన్న ఉద్రిక్తత తొలగించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. దేశ రక్షణ పాలనలో అద్భుతంగా పనిచేస్తున్నప్రధాని మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని శ్రీవారిని వేడకున్నానని అన్నారు. శనివారం ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి ఆయనకు స్వామి వారి ప్రసాదం అందించారు. అనంతరం కిషన్‌ రెడ్డి ఆలయం వెలుపల విూడియాతో మాట్లాడుతూ దేశాన్ని అత్యంత బలవంతంగా తయారు చేయడానికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌ షాకు ఆరోగ్యం, శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. దీపావళి రోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయతో త్వరలోనే కరోనా నశిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారు ప్రజందరికీ ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాని అన్నారు. ఇదిలావుంటే తిరుపతి ఐఐటీ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనుందని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం మేర్లపాక రెవెన్యూ పరిధిలో ఉన్న తిరుపతి ఐఐటీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.514 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. డీఆర్‌డీవో లాంటి డిఫెన్స్‌ ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో కొత్త పరిశోధనను చేయనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ కేఎన్‌ సత్యనారాయణ, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *