అసలేం జరుగుతుందో అర్ధం కావడం లేదు : రోహిత్

బెంగళూరు : అసలేం జరుగుతుందనే విషయంపై తనకు స్పష్టత లేదని, ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అంటున్నాడు. తొడ కండర గాయం నుంచి కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని హిట్మ్యాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు ముందు తనలో ఎలాంటి లోపాలు లేవనే విషయాన్ని అందరికి స్పష్టం చేయానే ఉద్దేశంతోనే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్నట్లు రోహిత్ చెప్పాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఎంపిక కానీ రోహిత్.. టెస్ట్ ఫార్మాట్కు మాత్రం సెలెక్ట్ అయ్యాడు.

యూఏఈ వేదికగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ ఐదోసారి విజేతగా నిలిపాడు. అనంతరం హిట్మ్యాన్.. టీమిండియాతో ఆస్ట్రేలియాకు వెళ్లకుండా భారత్కు తిరిగి వచ్చాడు. తొడ కండర గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ ఎన్సీఏలో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రోహిత్ శర్మ పీటీఐతో మాట్లాడాడు. ‘అసలేం జరుగుతుందనే విషయంపై నాకు స్పష్టత లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. నేనొక విషయం చెప్పదల్చుకున్నాను . నేను నిరంతరం బీసీసీఐ, ముంబై ఇండియన్స్ తో చర్చ జరుపుతున్నా. లీగ్ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెడతానని మా జట్టుకు చెప్పాను. ఆ విషయంలో స్పష్టత వచ్చాక పరుగు చేయడంపై దృష్టి సారించాను’ అని రోహిత్ చెప్పాడు.

‘ఇప్పుడు తొడ కండర గాయం నుంచి కోలుకున్నా. ఇప్పుడిప్పుడే మరింత ఫిట్నెస్ సాధిస్తున్నా. టెస్టు సిరీస్ ఆడకముందే పూర్తి ఫిట్నెస్ సాధించాననే నమ్మకం కలగాలి. ఎందుకంటే.. ఏ విషయంలోనూ నన్ను వేలెత్తి చూపొద్దని అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఎన్సీఏలో ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేం అనుకున్నా పట్టించుకోను. 25 రోజుల పాటు పూర్తిస్థాయిలో కోలుకొని టెస్టు సిరీస్కు సిద్ధమవ్వాల నుకుంటున్నా. విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదు’ అని రోహిత్ శర్మ అన్నాడు.

‘ముంబై ఇండియన్స్ రాత్రికి రాత్రే విజయవంతమైన జట్టు కాలేదు. దానికంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మూడేళ్లుగా జట్టుకు కష్టపడ్డాం. ఇక జట్టు యాజమాన్యం కూడా మమ్మల్ని నమ్మింది. దాంతో ఒక బలమైన బృందాన్ని నిర్మించాం. ఈ సీజన్లో అందరూ బాగా ఆడారు. సమిష్టి కృషి వల్లే టైటిల్ సాధించాం. అద్భుతంగా బౌలింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్ జట్టులో ఉండడం మా అదృష్టం. అతడు గతేడాది ఢల్లీి తరఫున ఆడాడు. 2020 వన్డే లో ఆ ఢల్లీి వదిలేయడంతో మేం కొనుగోలు చేశాం. అతడి ఎంపిక పట్ల గర్వంగా ఉన్నా’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *