30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ మూవీ ప్రమోషన్స్‌ చేయకపోతే ఎలా...?

హైదరాబాద్ : బుల్లితెర పై యాంకర్‌ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్‌ మాచిరాజు.. వెండితెరపైకి హీరోగా వస్తున్న సినిమా ‘’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’’. సుకుమార్‌ శిష్యుడు మున్నా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. యంగ్‌ బ్యూటీ అమృత అయ్యర్‌ హీరోయిన్‌ గా నటించింది. ఈ చిత్రాన్ని ఎస్‌ వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎస్‌.వీ బాబు నిర్మించారు. ప్రదీప్‌ కి ఉన్న ఇమేజ్‌ ని దృష్టిలో పెట్టుకొని గీతా ఆర్ట్స్‌ 2 మరియు యూవీ క్రియేషన్స్‌ వారు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రీబ్యూట్‌ చేయడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది . మార్చిలో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది . గత ఏడున్నర నెలలుగా కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల కాగా.. మరొకొన్ని ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ సాంగ్స్‌ అంటూ ప్రమోషన్స్‌ చేసుకుంటూ జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ టీమ్‌ మాత్రం కరోనా డేస్‌ లో ఎలాంటి సందడి చేయలేదు.

నిజానికి ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాపై ఈ ఏడాది ఆరంభంలో పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది . ఈ మూవీలో సిద్‌ శ్రీరామ్‌ ఆల పించిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్‌ తో మరింత క్రేజ్‌ వచ్చి చేరింది. సాంగ్‌ అంత పెద్ద హిట్‌ అయినా ఈ సినిమా రిలీజ్‌ కి రెడీగా ఉందని జనానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ సినిమాను థియేటర్స్‌ లో విడుదల చేస్తారో లేక ఓటీటీలో రిలీజ్‌ చేస్తారో అనే క్లారిటీ అయితే ఇవ్వాలి. స్టార్‌ హీరో సినిమా అయితే థియేటర్స్‌ లో విడుదల చేసే రెండు రోజుల ముందు హడావుడి చేసినా కలెక్షన్స్‌ వస్తాయి. కానీ ఇది డెబ్యూ హీరో మూవీ. థియేటర్స్‌ కి ఆడియెన్స్‌ తో ఫుల్‌ చేయడానికి ఎంతో కొంత హడావుడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రమోషన్స్‌ చేయకపోతే జనాలు సినిమాని.. సినిమాలో నటించిన వారిని మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి యాంకర్‌ ప్రదీప్‌ డెబ్యూ మూవీ గురించి మేకర్స్‌ ఏమి అనుకుంటున్నారో అని ఫిలిం సర్కిల్స్‌ లో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *