వేడెక్కుతున్న గ్రేటర్‌ రాజకీయం, ఆశావహుల సందడి

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవ్వడంతో రాజధానిల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్‌కు సమానంగా విపక్షాలు దూకుడు పెంచాయి. కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ సమావేశాలతో కారు పార్టీకి సవాలు విసురుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికలకు అందరికంటే ముందుగా టీఆర్‌ఎస్‌ సిద్ధమైనప్పటికీ.. తామేవిూ తక్కువ కాదంటూ కాషాయదళం దూసుకొస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను సిద్ధం చేసింది. అయితే దుబ్బాక ఫలితం తరవాత ఇప్పుడు బిజెపి వైపు యువత ఎక్కువ దృష్టి సారించింది. టిక్కెట్లు ఆశిస్తున్న వారు బిజెపి కార్యాయానికి క్యూ కట్టారు. ఎవరూ ఊహించన విధంగా బీజేపీలో టికెట్‌ కోసం అభ్యర్థులు ఎగబడుతున్నారు. తమకంటే తమకే సీటు దక్కాలని పోటీపడుతున్నారు. మొదటి జాబితా ప్రకటించకముందే తమకు టికెట్‌ ఇవ్వాలం టూ నేతలు ఎదురుచుస్తున్నారు. మరోవైపు బిజెపి పరిశీలకుడు రాజేంద్ర యాదవ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన పార్టీనేత లక్ష్మణ్‌, బండి సంజయ్‌, వివేక్‌ తదితరులతో భేటీ అయ్యారు. మ్యానిఫెస్టో సమాచార ప్రచార వ్యూహంపై చర్చించారు. దుబ్బాక విజయంతో దూకుడుగా ఉన్న బీజేపీ గ్రేటర్‌పై కాషాయం జెండా ఎగుర వేయాలని పట్టుదలతో సన్నాహాలు చేపట్టింది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధిష్ఠానం పావు కదుపుతూ అగ్రనాయకులతో కమిటీలు వేసింది. దీంతో ఈ ఎన్నికను బీజేపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందో స్పష్టమవుతోంది.

ఒక వైపు అగ్రనాయకుతో వ్యూహరచన చేస్తునే, మరో వైపు ఆశావహుల నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తోంది.ఎన్నికను ఎదుర్కొనేందుకు బీజేపీ గ్రేటర్‌ను ఆరు జిల్లాలు గా విభజించింది. నగరంలో నాలుగు, శివారు ప్రాంతాలను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసి, అధ్యక్షులను నియమించింది. పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఇతర బాధ్యతను ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికి అప్పగించింది. అలాగే, ఆయా జిల్లా అధ్యక్షులకు కార్పొరేటర్‌ ఆశావహుల నుంచి దరఖాస్తు తీసుకునే బాధ్యతలనూ తాజాగా అప్పగించింది. గ్రేటర్‌లో బీజేపీ తరఫున ఆశావహులు పోటీ పడుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక్కో డివిజన్‌ నుంచి నాలుగురి నుంచి పన్నెండు మంది వరకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వారీగా వచ్చిన దరఖాస్తులను స్కూట్రినీ చేసి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆయా జిల్లాల్లో అధ్యక్షుడి స్థాయిలోనే కొంతమేరకు ఫిల్టర్ ‌ చేసి, ముఖ్యమైన ఆశావహుల జాబితాను రాష్ట్ర పార్టీకి అందించనున్నారు. డివిజన్‌కు ఇద్దరి నుంచి నాలుగురు ఆశావహుల పేర్లను అందించేందుకు ఆయా జిల్లా అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు. అత్యధికులు పోటీ పడిన జిల్లాల్లో ముఖ్యమైన ఐదు, ఆరుగురి పేర్లతో జాబితాను పంపించే యోచనలో అధ్యక్షులు ఉన్నట్లు సమాచారం.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *