దేశం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటే మన దేశంలో కొంతమంది అధికారులు, అవినీతే పరమావధిగా పనిచేస్తూ, ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తున్న అత్యంత అవినీతిపరున్ని కూడా గిన్నిస్ రికార్డులో ఎక్కించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ వారికి ఫిర్యాదు చేసింది. ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కీసర మండలం తహశీల్దార్ ఒక పనికి రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసి, మొదటి విడతగా ఒక కోటి పది లక్షలు నగదు తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఒకేసారి అంత మొత్తంలో నగదు దొరకడం రికార్డ్ అని ఇలాంటి అతి పెద్ద అవినీతిపరున్ని, అవినీతి తిమింగలంగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి, కో పౌండర్ వాసిరెడ్డి గిరిధర్, కార్యదర్శులు కొన్నె దేవేందర్, జగత్ సూరి, బత్తిని రాజేష్, వరికుప్పల గంగాధర్, జి. హరిప్రకాష్, మంత్రి భాస్కర్, స్వప్నారెడ్డి, మారియా ఆంతోనిలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతినెల జీతభత్యాలతో పాటు, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న దోచుకోవడం పనిగా కొంతమంది అధికారులు పనిచేస్తూ రాష్ట్రం పేరును సర్వనాశనం చేస్తున్నారని వారు తెలిపారు. అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, అధికారులతో పనిచేయించుకోవడం మన కనీస బాధ్యత అని వారు అన్నారు. సమాజంలో మార్పు కోసం, ప్రజల్లో, యువతలో మార్పుకోసం వైఏసీ సంస్థ ఒక వినూత్న కార్యక్రమం చేస్తుందని, శాంతియుతంగా అవినీతిని నిర్మూలించేందుకు, అవినీతిపరులను ప్రశ్నించేందుకు యువత వైఏసీతో చేతుకు కలపాల్సిన అవసరం ఉందన్నారు

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *