గొర్రె కాపరులకు ప్రభుత్వం చేయూత : డా. బెంజీమెన్

టేక్మాల్ (మెదక్) (ప్రజాజ్యోతి) : గొర్రె కాపరులకు ప్రభుత్వం చేయూత నిస్తుంది అని పశు వైద్యాధికారి డాక్టర్ బెంజిమన్ పేర్కొన్నారు. శనివారం టేక్మాల్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గొర్రె కాపరులకు ప్రభుత్వ పరంగా చేయూతనిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు గొర్రె కాపరులు కష్టపడి ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ముఖ్యంగా గొర్రెలకు సీజనల్ వ్యాధులు వస్తుంటాయని ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు మూతి పుండ్లు గాలికుంటు వ్యాధులు ఉంటాయని స్థానికంగా ఉన్న ఆస్పత్రి పశు వైద్యశాలకు తీసుకు వస్తే సరైన మందులు ఇస్తామన్నారు. మండలంలో గొర్రెల పశువుల పై చాలా కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని పేర్కొన్నారు. గొర్రె కాపరులు గొర్రెలకు వైద్యం చేయించుకోవడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా గొర్రెల యూనిట్లు గతంలో అందించడం జరిగిందన్నారు. ఇందుకు రాయితీని కల్పించి గొర్రె కాపరులకు ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రేమిల, పిఎసిఎస్ డైరెక్టర్ కిషన్, వైద్య సిబ్బంది సతీష్, హనుమంతు, గొల్ల కురుమ సంఘం అధ్యక్షులు యాదగిరి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *