Free Health Check Up for Cyberabad Police Staff సైబరాబాద్ పోలీస్

పని చేసే స్థలంలోనే సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

రంగారెడ్డి (ప్రజాజ్యోతి న్యూస్) : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ని సైబరాబాద్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ) మంగళవారం నాడు  మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ హాజరై ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా కేర్ ఆసుపత్రి సౌజన్యంతో సీపీ  పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. సిబ్బందికి రక్త పరీక్షలు, బిపి, జనరల్ మెడిసిన్ డాక్టర్లు తో కన్సల్టేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్  వీసీ సజ్జనార్ మాట్లాడుతూ పోలీసులు లాక్డౌన్ డ్యూటీలో భాగంగా నిరంతరం ప్రజలతో పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజా రక్షణకు వివిధ కంటైన్మెంట్ జోన్ లలో పని చేయాల్సి ఉంటుందన్నారు. సిబ్బంది పని చేసే స్థలంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి  ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేసుకోవడానికి వీలుందన్నారు. కావున సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

Read More From PrajaJyothi News : పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ వీ.పీ గౌతమ్

Free Health Check Up for Cyberabad Police Staff సైబరాబాద్ పోలీస్
Free Health Check Up for Cyberabad Police Staff సైబరాబాద్ పోలీస్

Read More From PrajaJyothi News : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూత

కరోనా వాక్సిన్ వచ్చే వరకి ఇమ్యునిటీ పెంచుకోవడమే దారి : సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్

సిబ్బందికి ఇమ్యునిటీని పెంచుకునేందుకు సిబ్బందికి విటమిన్-సి ట్యాబ్లెట్లు, ఆమ్లా, డ్రై ఫ్రూట్స్ తదితర వాటిని ఇస్తున్నామన్నారు. కోవిడ్ 19 కరోనా వైరస్ కు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స లేదన్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ను కనిపెట్టే వరకు ఇమ్యునిటీ (రోగనిరోధక శక్తి) ని పెంచుకోవడమే ఒక్కటే మన చేతిలో ఉందన్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. ఆహార, నిద్ర విషయాలలో సమయపాలన పాటించాలన్నారు. ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటుకు సహకరించినా సీటీసీ ప్రిన్సిపాల్ ఏడీసీపీ కవిత, ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య, కేర్ ఆసుపత్రి వైద్యులు రత్నాకర్ కు సీపీ గారు అభినందనలు తెలిపారు. సైబరాబాద్ లోని  మెడికల్ మొబైల్ టీమ్స్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా వైద్య పరీక్షలు చేశామన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లోని సీఏఆర్ (సీఎస్  డబ్ల్యూ) హెడ్ క్వార్టర్ 60 మందికి సిబ్బందికి  ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. శారీరక వ్యాయామం తో పాటు మంచి ఆహారం, సరైన నిద్రతో రోగ నిరోధక శక్తి (ఇమ్యూ నిటీ) ని పెంచుకోవచ్చనారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

Read More From PrajaJyothi News : నేత కార్మికులకు ప్రభుత్వం అండ ఉంది : కే.టీ.ఆర్

వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి

ఆసుపత్రులకు వెళ్లే వారు జాగ్రత్తలు వహించాలన్నారు. సానిటైజర్స్, మాస్కులను తప్పక వాడాలన్నారు. కుటుంబ సభ్యులకు ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి వారికి దూరంగా ఉండాలన్నారు. ఒక యాప్ ని డెవలప్ చేయాలని ఐటి  సెల్ సిబ్బందికి సూచించారు. అనంతరం విమెన్ అండ్ చైల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యం విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు వారి హెల్త్ ప్రొఫైల్స్ ను డాక్యుమెంటేషన్ చేస్తున్నామన్నారు. తద్వారా అవి ఫ్యూచర్ రికార్డ్స్ గా పనిచేస్తారన్నారు. వీటితో పాటు ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, హెరిడీటరీ వంటి వంటి వివరాలను పొందుపరుస్తామన్నారు. కమిషనర్ సజ్జనార్ చెప్పిన విధంగా ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్ ను డెవలప్ చేస్తామన్నారు. సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్ మాణిక్ రాజ్ మాట్లాడుతూ సీపీ  సూచనల మేరకు మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ 19 కరోనా కట్టడికి సైబరాబాద్ పోలీస్ లు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.

Read More From PrajaJyothi News : ఆంధ్రా జల దోపిడీ ని అడ్డుకోరేం..? వంశీ చందర్ రెడ్డి

కరోనా కట్టడికి పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయం : కేర్ ఆసుపత్రి డాక్టర్ రత్నాకర్

సీటీసీ ప్రిన్సిపాల్ ఏడీసీపీ క్రైమ్స్ 2  కవిత మాట్లాడుతూ, సైబరాబాద్ పోలీస్ సిబ్బంది హెల్త్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి యాప్ కు అనుసంధానం చేస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. కవిత, ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య ఎన్ జెపి మాట్లాడుతూ… సీపీ సజ్జనార్ సూచనల మేరకు సిబ్బందికి ఇమ్యూనిటీ ని పెంచేందుకు విటమిన్-సి, ఉసిరి, డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నామన్నారు. సిబ్బందికి మాస్కులను, శానిటైజర్లను తదితరాలను అందజేస్తున్నామన్నారు. కేర్ ఆసుపత్రి డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. తప్పనిసరిగా మాస్కూలు, శానిటైజర్లను వాడాలన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.  ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, సీటీసీ ప్రిన్సిపాల్ ఏడీసీపీ క్రైమ్స్ 2,  కవిత, ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య ఎన్ జెపి, సీఏఆర్ (సీఎస్డబ్ల్యూ) హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మి నారాయణ, సీటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఏసీపీ కిషోర్ కుమార్, సీటీసీ ఏసీపీ బాలకృష్ణ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, కేర్ ఆసుపత్రి డాక్టర్ రత్నాకర్, సీటీసీ డాక్టర్లు సరిత, సుకుమార్, ఐటిస ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, సీఏఆర్ (సీఎస్డబ్ల్యూ) హెడ్ క్వార్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

Read More From PrajaJyothi News : PrajaJyothi News Today E-Paper PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *