కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి నలుగురు అత్యాచారం

జైపూర్ : రాజస్థాన్‌ రాష్ట్రం చురు జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు యువకులు ఓ యువతికి కూల్‌ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చురు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి పోటీ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు సవిూప పట్టణంలోని విూ సేవా కేంద్రానికి వెళ్లింది. అక్కడ దరఖాస్తు ఫాం నింపుతుండగా విక్రమ్‌ అనే వ్యక్తి కనిపించాడు. తెలిసిన వ్యక్తే కావడంతో యువతి అతడి సాయంతో దరఖాస్తు పక్రియ పూర్తిచేసింది. అనంతరం కూల్‌ డ్రింక్ తాగుదామనే వంకతో విక్రమ్‌ ఆమెను బయటకు తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్ షాప్‌ దూరం ఉందని చెప్పి తన స్నేహితులకు ఫోన్‌ చేశాడు. దాంతో ఓ కారులో అతని ముగ్గురు స్నేహితులు వచ్చారు.

అనంతరం కూల్ డ్రింక్స్ తీసుకుని విక్రమ్‌ గదికి వెళ్లారు. అక్కడ యువతి కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకోగానే నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియోలు కూడా తీశారు. జరిగిన విషయం ఎవరికైనా చెప్పినా, పోలీసుకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని, వీడియోలో సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి పంపించారు. ఇంటికి వెళ్లిన యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *