Bhadradri Kothagudem Collector Dr. M.V.Reddy Recieving a Fish as a Gift by Fishing families మత్సకారుల కుటుంబాలు

తమ సమస్యలను కలెక్టర్ తో చెప్పుకున్న మత్సకారుల కుటుంబాలు

భద్రాద్రి కొత్తగూడెం  (ప్రజాజ్యోతి న్యూస్) : చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మత్సకారుల కుటుంబాలు భరిస్తున్న ఆర్థిక స్థితిగతులు మెరుగు పరచేందుకు ప్రభుత్వం చేపల పెంపకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి తెలిపారు. గురువారం సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులో చేపలు పట్టు విధానాన్ని పరిశీలించి, మత్సకారుల కుటుంబాలు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 684 చెరువుల్లో 1.78 కోట్ల చేప పిల్లలు వేసినట్లు ఆయన తెలిపారు . ఇప్పటి వరకు 590 చెరువుల్లో ఆరు వేల టన్నుల చేపలు దిగుబడి వచ్చిందని ఇంకనూ దాదాపు 3 వేల టన్నుల చేపలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలియచేశారు  . మత్సకారుల సంఘాలు , గ్రామ పంచాయతీల ఆద్వర్యంలో పట్టు కార్యక్రమం కొనసాగుతున్నట్లు  తెలిపారు. గత సంవత్సరం ఈ చెరువులో 60 టన్నుల చేపల దిగుమతి వచ్చిందని ఈ సంవత్సరం 80 టన్నులు వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Read More From PrajaJyothi News : కనుమరుగవుతున్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలు

Bhadradri Kothagudem Collector Dr. M.V.Reddy Recieving a Fish as a Gift by Fishing families మత్సకారుల కుటుంబాలు
Bhadradri Kothagudem Collector Dr. M.V.Reddy Recieving a Fish as a Gift by Fishing families మత్సకారుల కుటుంబాలు

Read More From PrajaJyothi News : సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం

ఈ కాలంలో మత్సకారులలో ప్రతి ఒక్కరికి 20 వేల ఆదాయం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి

తక్కువ పెట్టుబడితో మత్సకారుల కుటుంబాలు గ్రామ పంచాయతీకి చక్కటి ఆదాయం సమకూర్చే సంపద చేపల పెంపకమని ఆయన తెలియచేశారు. 385 మంది సభ్యులున్న మత్సకారుల కుటుంబాలు ఈ చెరువులో ఈ సీజన్ లో ఒక్కొక్కరికి దాదాపు 20 వేల రూపాయల వరకు ఆదాయం సమకూరనన్నట్లు తెలిపారు. చేపలను ఆహారంగా తీసుకోవడం వలన మనిషికి రోగ నిరోధక శక్తి వస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపలు సంరక్షణకు అదేవిధంగా చేపలను ఎక్కువగా పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు. ప్రతి సంవత్సరం నీళ్లు సమృద్ధిగా ఉండే చెరువులు కాకుండా తక్కువ నీళ్లుండే చెరువుల్లో చేపల మేత సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకుని 684 చెరువుల్లో చేపలు పెంచేందుకు ప్రణాళిక తయారు చేయడంతో పాటు 2 కోట్ల చేప పిల్లలకు ఇండెంట్ తయారు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి వివరించారు. 

Read More From PrajaJyothi News : రియల్ చెక్ నిర్వహించిన మహమ్మద్ అబ్దుల్ అజీం

ఉన్న వనరులను వాడుతూ చేపలు పెంచడానికి ప్రభుత్వ సబ్సిడీ

ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున మత్సకారుల కుటుంబాలు , ప్రజలు ఎండ వల్ల ఇబ్బందులు పడకుండా చెరువుల పరిధిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు . గ్రామస్థాయిలో ఉన్న వనరులను వినియోగించుకుని పెట్టుబడి లేకుండా చేపల వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న మత్సకారుల కుటుంబాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకాన్ని పెద్దఎత్తున చేపట్టినట్లు ఆయన వివరించారు. మన రాష్ట్రంలో చేపలు పెంపకానికి కోస్తా ప్రాంతం లాగా వనరులు అదుబాటులో లేనందున ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ చేపలు పెంపకాన్ని చేపట్టాలని ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి వివరించారు. చెరవులో నీరు నిరంతరాయంగా ఉండేందుకు సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుసంధానం చేయాలని రైతులు కోరగా అట్టి ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు తక్కువ దరలకు చేపలు విక్రయించాలని ప్రజలు కోరగా ఆలోచన చేస్తామని అన్నారు.

Read More From PrajaJyothi News : తెలంగాణను దోచుకొని తింటున్నారు : సంపత్ కుమార్

గ్రామ పరిధిలో మొక్కల పెంపకం అభినందనీయం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి

ఈ సంవత్సరంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న సంవత్సరంలో చేపల దిగుబడి అధికంగా వచ్చే విధంగా కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి వివరించారు. సుజాతనగర్ గ్రామపంచాయతీ పరిధిలో మొక్కలు పెంపకం బాగా చేపట్టరని ప్రజా ప్రతినిధులను, అధికారులను అభినందించారు. వైద్య సిబ్బంది సేవలను కూడా అభినందించారు. చెరువు వద్ద మత్సకారుల కుటుంబాలు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించు విధంగా ఏర్పాట్లు చేయడం పై జిల్లా మత్స్యశాఖ అధికారిని కలెక్టర్ అభినందించారు. విక్రయిస్తున్న తీరు , చేపల రకాలను కలెక్టర్ పరిశీలించారు . అనంతరం మత్సకారుల కుటుంబాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి కు చేపను బహుమతిగా అందచేశారు. ఈ కార్యక్రమంలో సింగభూపాలెం, సుజాతనరగ్ సర్పంచ్ లు, జడ్పీటిసి బిందుచౌహాన్, యంపిపి , జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, ఇరిగేషన్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, డిఆర్‌డిఏ మదుసూదన్ రాజు, మండల ప్రత్యేక అథారి కృపాకర్‌రావు, ఆర్డీఓ స్వర్ణలత, తహసిల్దార్ నాగరాజు, యంపిడిఓ , మత్స్య సంఘ అధ్యక్షులు సూర్యం, డైరెక్టర్లు సాయిలు, మున్నా తదితరులు పాల్గొన్నారు.

Read More From PrajaJyothi News : PrajaJyothi News Today E-Paper PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *