మట్టి పాత్రలతో చేసిన వంట అమృతం తో సమానమా

జగిత్యాల : జగిత్యాలలో మట్టి పాత్రల వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. మట్టి పాత్రలో చేసిన వంటకాలు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు అని ప్రచారం జరుగుతుండగా వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. స్టీల్ పాత్రలు వాడుకలోకి రాక ముందు మట్టి పాత్రల్లోనే వంటలు చేసుకునే వారు కాగా కాల క్రమంలో స్టీల్ పాత్రలు తయారీతో మట్టి పాత్రలు మరుగున పడినట్లయింది. అయితే ప్రకృతి ప్రేమికులు, ఆయుర్వేదంను నమ్మేవారు, కొత్త రుచులు కోరుకునే వారు మట్టి పాత్రలు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో వండే కూరలు రుచికరంగా ఉండటంతో వారానికి ఒక రోజు అయినా మట్టి పాత్రల్లో వంటలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కుండలో వండిన చికెన్ ను మాంసం ప్రియులు అత్యంత ఇష్టపడుతుంటారు.

ఈ నేపథ్యంలో మట్టి పాత్రల వాడకం క్రేజీ గా మారింది. జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో ప్రతి గురువారం రకరకాల ఆకృతుల్లో మట్టి పాత్రలు విక్రయిస్తుంటారు. సైజును బట్టి ఒక్కో పాత్ర రూ.100 నుండి రూ.250 వరకు ఉంటుంది. చేతి వృత్తిపై ఆధార పడి జీవించే కుమ్మరులు వీటిని తయారు చేసి జగిత్యాలలో విక్రయిస్తున్నారు. పట్టణంలోని తహసీల్ చౌరస్తా, పార్క్ ఎదురుగా కూడా మట్టి పాత్రలు నిత్యం విక్రయిస్తుంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి ఇచ్చే మట్టి పాత్రల వాడకం రాబోయే రోజుల్లో మరింత పెరగనుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *