రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ కూడా ఇవ్వరా...!!

హైదరాబాద్ : అవును .. ఆమె అలిగింది. తన డైరెక్టర్‌ పైనే కినుక వహించింది. కారణం తన కోసం సరైన పాత్రను ఆఫర్‌ చేయలేదని. ఛాన్స్‌ ఇచ్చినా కానీ తనకంటూ ఒక్క సాంగ్‌ అయినా లేదట. కనీసం యువ హీరోతో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ కూడా ఇవ్వలేదు. ఏ యాంగిల్‌ లో చూసినా తాను చేస్తున్నది రొటీన్‌ రోల్‌ అని తెలుసుకుని కాస్త కినుక వహించిందట. ఇంతకీ ఎవరీ భామ? ఎవరిపై అలిగింది? అంటే.. అందాల శ్రేయ జక్కన్నపై అలిగిందట. సీనియర్‌ బ్యూటీ శ్రేయ కొంత గ్యాప్‌ తర్వాత తిరిగి టాలీవుడ్‌ లో ఘనమైన ఎంట్రీ కోసం తహతహలాడుతోంది. ఈ తహతహలోనే ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనకు ఆర్‌.ఆర్‌.ఆర్‌ లో నటించే ఆఫర్‌ ఇచ్చారు. అయితే అది పరిమితంగా ప్రదర్శనకు ఉన్నది మాత్రమేనని ముందే చెప్పారట. 15 నిమిషాల నిడివితో కనిపించి వెళ్లిపోయే రోల్‌. అయినా అప్పుడు కాదని అనుకోలేదు. కానీ ఇప్పుడు తన పాత్రలో ఇంకేదైనా ఉంటే బావుణ్ణు అంటూ ఫీలవుతోందట.
ఇటీవల విదేశీ క్రీడాకారుడిని పెళ్లాడి బార్సిలోనా వెళ్లిపోయింది 38ఏళ్ల శ్రేయ. ప్రస్తుతం సంసార సరిగమల్ని ఆస్వాధించే పనిలో ఉంది. అయితే టాలీవుడ్‌ లో ఏదైనా పెద్ద ఆఫర్‌ వరిస్తే మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేదు. తదుపరి గమనం అనే సినిమాలోనూ ఈ అమ్మడు నటించనుంది. అయితే ఆర్‌.ఆర్‌.ఆర్‌ లో అతిథి పాత్ర మాత్రమే చేయనుంది. రాజమౌళి ఇంతకుముందు ఛత్రపతి చిత్రంలో శ్రేయ కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు మరో ఆఫర్‌ ఇచ్చారు. తెలుగులో నాగార్జున తర్వాత ఇతర అగ్ర హీరోలెవరూ ఛాన్సులివ్వలేదు ఎందుకనో.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *