మెగాస్టార్‌ తో అయినా ‘ఆహా’ అనిపించేనా....?

తెలుగు ఓటీటీ ఆహా సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌ లు మరియు టాక్‌ షోతో హోరెత్తిస్తోంది. తమ సబ్‌ స్క్రైబర్స్‌ కు ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందించడమే లక్ష్యంగా బాగా ఖర్చు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా చేస్తున్నదే సమంత టాక్‌ షో ‘సామ్జామ్‌’. తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో టాక్‌ షో లు వచ్చాయి. సమంత టాక్‌ షో చాలా విభిన్నంగా ఉంటుందంటూ అల్లు అరవింద్‌ మీడియా సమావేశం సందర్బంగా చెప్పాడు. అయితే మొదటి ఎపిసోడ్‌ విజయ్‌ దేవరకొండ తో స్ట్రీమింగ్‌ చేయగా ప్రేక్షకులు పెదవి విరిచారు.
టాక్‌ షో అంటే గతంలో ఎప్పుడు చెప్పని విషయాలను స్టార్స్‌ తో చెప్పించడం. అంతే తప్ప కొన్ని ప్రశ్నలు అడిగి గేమ్స్‌ ఆడించి వచ్చిన గెస్ట్‌ తో స్టార్స్‌ ను పోగిడించటం ఏంటో అంటూ మొదటి ఎపిసోడ్‌ పై కొందరు విమర్శులు చేశారు. మొదటి ఎపిసోడ్‌ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న సామ్‌ జామ్‌ ప్రోగ్రాం టీమ్‌ రెండవ ఎపిసోడ్‌ చిరంజీవితో ఆకట్టుకునేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నందిని రెడ్డి ప్రొగ్రాం ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్న ఈ టాక్‌ షో రెండవ ఎపిసోడ్‌ పై అందరి దృష్టి ఉంది.
ఆహాలో స్ట్రీమింగ్‌ కు రెడీ అయిన చిరంజీవి సామ్‌ జామ్‌ ఎపిసోడ్‌ పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మొదటి ఎపిసోడ్‌ పై పెదవి విరిచిన ప్రేక్షకులు మెగా ఎపిసోడ్‌ తో అయినా ఆహా అంటారా అనేది ఆసక్తికరంగా మారింది. టాక్‌ షోల్లో చిరంజీవి చాలా తక్కువగా పాల్గొంటారు. కనుక ఆయన నుండి ఎన్నో తెలియని విషయాలను సమంత రాబట్టే అవకాశం ఉంటుంది. మరి సమంత మరియు నందిని రెడ్డిలు ఆ ప్రయత్నం చేశారా అనేది చూడాలి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *