వాడిపడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అనర్థాలు

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వఛ్చతకు ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజల సహకారం లేకపోవడంతో ఎక్కడికక్కడ చెత్తకుప్పులు పేరుకుపోతున్నాయి. ప్రజలు తమ ఇంట్లో ఉన్న వ్యర్థాలను ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి బజార్లలో పడేస్తున్నారు. వేకువ జామునే పారిశుద్య కార్మకులు వీధులను శుభ్రం చేయడానికి రాగా చెత్తకుప్పలు పేరుకుంటున్నాయి. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డుపైకి చెత్తను విసరేస్తూ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు చెత్తను బండిద్వారా తరలించే అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొందరు మాత్రం ఇళ్లముందుకు చెత్తబండ్లు వచ్చినా వారికి డబ్బు ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగా రోడ్డుపై పడేస్తున్నారు. వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ద్య కార్మికులు తిడుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలు దెబ్బతినడానికి ఎవరిని కారణంగా చూడాలి. ఇప్పటికే విపరీతమైన పట్టణీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలి కూడా పీల్చడానికి లేకుండా పోతోంది. రోజువారీ వొత్తిళ్లనుంచి కాస్తంత దూరంగా జరిగి విశ్రాంతి తీసుకునే చోటు మిగలలేదు.

సమాజ శ్వాసకోశాలుగా పేరుపడ్డ ఉద్యావనాలను పట్టించుకోవడం లేదు. వాటి దుస్థితి తొలగించి తమ ఆయు రారోగ్యాలను కాపాడుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. పట్టణాలతో పాటు శివారు పంచాయతీల్లో సైతం కాంక్రీటు భవనాలు లేచిపోతున్నాయి. చెట్టూచేమ నరికివేతకు గురై, పొలాలు చదును చేయబడి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతున్నాయి. మహావృక్షాలను మింగుతూ రహదారులు వెడల్పు అయిపోతున్నాయి. ’పచ్చదనం ఒకప్పుడుండేది’ అనిపించేలా పట్టణంతోపాటు పరిసర పంచాయతీ విస్తరణ శరవేగంగా జరుగుతోంది. పచ్చదనం కూరుకుపోతున్నప్పుడల్లా పర్యావరణ ప్రేమికులు ఒక నిట్టూర్పు విడిచి ఊరుకుండడం తప్ప ఏవిూ చేయలేకపోతున్నారు. పోనీ పంచాయతీ ఉద్యావననాల్లోనైనా పచ్చదనం కనిపిస్తోందా అంటే అదీ లేదు. పంచాయతీల్లో సైతం ఉన్న పచ్చదనం కానరావడం లేదు. పాతుకుపోయిన వృక్షాలు ఒకట్రెండు మొండిగా నిలిచి ఉన్నాయి తప్ప అంతకుమించి పచ్చదనం ఈ ఉద్యానవనంలో మచ్చుకు కూడా కనిపించడంలేదు.

అసలు ఉద్యానవనం రూపే లేకుండా పోయింది. ఎన్ని వన మహోత్సవాలు , హరితహారం వంటి పథకాలు వచ్చిపోయినా.. ఒక్క మొక్కనాటి నీళ్లు పోసేవారు. లేకుండా పోయారు. పోనీ.. కనీసం పరిశుభ్రంగానైనా పరిసరాలను ఉంచుతున్నారా అంటే అదీ లేదు. ఎక్కడపడితే అక్కడ బాటిళ్లు, రేకు, పైపు, ఇతరత్రా వ్యర్థాలన్నీ రోడ్డుకు ఇరువైపులా, కాల్వల్లో పడేస్తున్నారు. ఇలా పడేసిన వస్తువులు, పాడైపోయిన వాహనాల , పరికరాలతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఖాళీస్థలాలు డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. చెట్లనుంచి రాలిన చెత్తాచెదారాల కుప్ప వీటన్నింటితో కలిసి అపరిశుభ్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి పీల్చడం మాటటుంచి అపరిశుభ్ర వాతావరణంతో లేనిపోని రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *