కమిట్‌మెంట్‌ టీజర్‌ విడుదల

హైదరాబాద్ : టాలీవుడ్‌ లో ఇప్పటివరకు బోల్డ్‌ కంటెంట్‌ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులు మాత్రం కంటెంట్‌ ఓరియెంటెడ్‌ స్టోరీతో వచ్చే బోల్డ్‌ సినిమానే ఆదరిస్తారు. ఇదే కోవకు చెందిన చిత్రం కమిట్‌మెంట్‌. తేజస్వి మడివాడ, అన్వేషి జైన్‌, రమ్య పసుపిలేటి,సూర్య శ్రీనివాస్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కమిట్‌మెంట్‌ టీజర్‌ను విడుదల చేశారు. బీచ్‌ వెంబడి సరదాగా షికారు చేస్తున్న కపుల్‌తో షురూ అయ్యే టీజర్‌..నాలుగు భిన్నమైన స్టోరీలతో సాగుతుంది. నలుగురు మహిళల జీవితంలోకి పురుషులు ఎంటరైన తర్వాత వారి జీవితాలపై కమిట్‌ మెంట్‌ ప్రభావం ఎలా పడిందనేది సినిమాలో చూపించనున్నట్టు టీజర్‌ ను చూస్తే అర్తమవుతుంది. రొమాంటిక్‌ గా సాగుతూనే మరోవైపు ఆడపిల్ల కనబడితే కమిట్‌మెంట్లు, కాంప్రమైజ్‌లు తప్ప ఇంకేమి ఆలోచించరా అంటూ తేజస్వి చెప్పే డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. లక్ష్మీకాంత్‌ చెన్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *