Coconut Water Benefits in Telugu కొబ్బరిబొండం

బోలెడన్ని ఆరోగ్య ప్రయోజానాలు కొబ్బరిబొండం లోనే ఉన్నాయ్!

వేసవి వచ్చింది…, ఎండలు కూడా మండిపోతున్నాయి…, ఇప్పుడు ఈ సమయంలో అందరు డిహైడ్రేట్ అవుతూ తమ శక్తిని తిరిగి పొందటానికి కొబ్బరిబొండం తాగుతూ ఉంటారు. అయితే ఈ కొబ్బరినీళ్ళు తాగటం వలన కేవలం శక్తి ఒక్కటే కాకుండా ఇంకెన్నో మంచి మంచి ఆరోగ్య ఫలితాలు చేకురుతాయి. కాని మార్కెట్ లో ఈ కొబ్బరిబొండం ధర ఎక్కువ కావటం వలన ఎంతో మంది నిరాశ చెందుతారు.
కాని ఒక్కటి మాత్రం నిజం, కొన్ని రోజుల తర్వాత మన ఆరోగ్యం క్షినించినప్పుడు మనం హాస్పిటల్స్ లో మందుల కోసం పెట్టె ఖర్చు తో పోలిస్తే దీని యొక్క విలువ చాల తక్కువే. మరి ఇక నుండి అయిన మీ ఆరోగ్యానికి ధరలతో ముడిపెట్టకండి.

Read More From PrajaJyothi News : కరోనా వైరస్ నివారణ చిట్కాలు మరియు కరోనా లక్షణాలు

Coconut Water Benefits in Telugu కొబ్బరిబొండం
Coconut Water Benefits in Telugu కొబ్బరిబొండం

Read More From PrajaJyothi News : అమృతం సీరియల్ కి సిక్వల్ అమృతం ద్వితియం

తాపం తీర్చుకోడానికి తాటి ముంజలకి సాటి మరోటి లేదు

కేవలం కొబ్బరిబొండం ఒక్కటే కాదు. ఈ మండుతున్న ఎండల్లో మన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తాటి ముంజలు కుడా మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. కొబ్బరినీటిలా ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా సహకరిస్తాయి. ముఖ్యంగా ఈ తాటి ముంజలు తినటం వలన మన శరీరం చల్లబడుతుంది. వేడి నుండి కాపాడుతుంది. బహుశా అందుకే చెప్తారేమో, సీజనల్ గా లభ్యమయ్యే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని.

Read More From PrajaJyothi News : ఇలియానా కి ఇప్పుడు అతడే దేవుడు అయ్యాడు!

కిడ్ని సమస్యలకి కొబ్బరిబొండం ఉత్తమమైన మందు

ఇక కొబ్బరిబొండం చేసే మేలు కోసం చెప్పాలంటే అంత ఇంత కాదండోయ్, ఈ కొబ్బరినీటిని భువి పై దొరికే అమృతం తో పోల్చిన తప్పు లేదు. ఎందుకంటే ఓ కొబ్బరి బొండం లో కాసింత గ్లూకోజు పౌడర్ కలిపి తాగితే శరీరంలోని అలసటతో పాటు నీరసం కూడా తగ్గిపోయి నిమిషాల్లో శక్తిని చేకూరుస్తుంది. అలాగే ఈ కొబ్బరిబొండల్లో లభ్యం అయ్యే కొబ్బరి లోని పీచు పదార్థం మన శరీరానికి ఎన్నో ప్రోటీన్లను అందించి మన ఆరోగ్యన్ని కాపాడుతుంది. ఇంకో అధ్బుతం ఏంటంటే ఈ సహజమైన కొబ్బరి నీళ్ళు తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి పెరిగి మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తిన వాటితో పోరాడి మనల్ని పరిరక్షిస్తుంది. అదే విధంగా ఈ బొండం యొక్క నీటిని తాగటం వలన కిడ్ని సమస్యలు కూడా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు సైతం సలహాలు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు ? ఇక నుండి అయిన రోజుకి కనీసం ఒక్క కొబ్బరిబొండం అయిన నిర్మొహమాటంగా తాగేసేయండి.

Read More From PrajaJyothi News : PrajaJyothi News E-Paper Today in PDF

Share The News On
One thought on “ఆ పౌడర్ ను కొబ్బరిబొండం లో కలిపి తాగితే కిడ్ని సమస్యలు రావు!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *