రైతు నోట్లో మట్టి కొట్టేలా కేంద్ర చట్టాలు : ఎమ్మెల్సీ కవిత

కామారెడ్డి : కెసిఆర్‌ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం రైతలను నట్టేట ముంచేలా చేస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుకు వ్యతిరేకమని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతుకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుకు వ్యతిరేకం. వ్యవసాయ చట్టాల వల్ల రైతుకు భారీ నష్టం. నూతన చట్టంలో మద్దతు ధర అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరం. మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి… రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు తలపెట్టిన భారత్‌ బంద్‌లో భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతు ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతుకు సంఫీుభావం తెలిపిన ఎమ్మెల్సీ కవిత.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బ్లాక్‌ బెలూన్స్‌ను గాల్లోకి వదిలేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *