బన్నీ “పుష్ప” షూటింగ్‌ కు బ్రేక్‌ పడ్డట్లేనా...! వై కన్ఫ్యూజన్..?

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ కోసం గత ఏడాది నుండి వెయిట్‌ చేస్తూ ఉండగా సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ ఆరంభం అయ్యి రెండు మూడు వారాలు అయ్యిందో లేదో అప్పుడే కరోనా కారణంగా నిలిచి పోయిందని.. దర్శకుడు సుకుమార్‌ తో పాటు అంతా కూడా సెల్ఫ్‌ క్వారెంటైన్‌ కు వెళ్లి పోయారు… షూటింగ్‌ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుంది. రెండు మూడు వారాల వరకు మళ్లీ పుష్ప సినిమా షూటింగ్‌ కు బ్రేక్‌ పడ్డట్లే అంటూ ప్రచారం జరుగుతోంది. మరో వైపు పుష్ప షూటింగ్‌ ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలు నిజం కాదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజమండ్రి లోని అటవి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్‌ ను జరుపుతున్నారంటున్నారు. షూటింగ్‌ ఆగిపోలేదని మెగా కాంపౌండ్‌ కు చెందిన కొందరు అనధికారికంగా చెబుతున్నారు.

బన్నీ మాత్రం హైదరాబాద్‌ కు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని వారు క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకు సినిమా షూటింగ్‌ ఆగిపోయిందా లేదంటే సినిమా షూటింగ్‌ కంటిన్యూ అవుతుందా అనే విషయాలపై నిర్మాణ సంస్థ కాని డైరెక్షన్‌ టీం నుండి కాని స్పష్టత రాకపోవడం వల్ల అభిమానులు కన్ఫ్యూజ్‌ లో ఉన్నారు. షూటింగ్‌ లో ఈమద్య కరోనా అనేది కామన్‌ అయ్యింది. అయినా కూడా చాలా సినిమాలు బ్రేక్‌ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ తర్వాత ఉన్న సీరియస్‌ నెస్‌ కరోనా విషయంలో ఇప్పుడు లేదు అనేది అంతా ఒప్పుకునే విషయం. ఒక వేళ పుష్ప టీం లో ఎవరికి అయినా కరోనా నిర్థారణ అయినా కూడా వెంటనే షూటింగ్‌ ను వారాలకు వారాలు నిలిపేయాల్సిన అవసరం లేదు అనేది కొందరి వాదన. పుష్ప టీంలో కరోనా కలకలం సృష్టించినా కూడా షూటింగ్‌ ఎక్కువ రోజులుగా ఎక్కువగా ఆగే అవకాశం లేదంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది మేకర్స్‌ నోరు విప్పితే కాని క్లారిటీ రాదు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *