బంతి కొత్తదైనా, పాతదైనా బూమ్రా వికెట్లు తీయగలడు : పేస్‌ బౌర్‌ జోష్‌ హేజిల్‌వుడ్

అడిలైడ్‌ : ఇండియా చివరిసారి 2018,19 లో ఆస్ట్రేలియా లో పర్యటించినప్పుడు చారిత్రక టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని అందుకుంది. ఆ విజయంలో టీమిండియా పేస్‌ బౌర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. సిరీస్‌లో మొత్తం 21 వికెట్లు తీసుకొని, ఆసీస్‌ స్పిన్నర్‌ నేథన్‌ యన్‌తో కలిసి టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఇప్పుడు మరోసారి ఆస్టేల్రియా టూర్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈసారి కూడా బుమ్రా టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో 27 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్ల వీరు జాబితాలో రెండోడోస్థానంలో నిలిచాడు. దీంతో ఈసారి ఆస్టేల్రియాలో టీమిండియా విజయావకాశాలు మరోసారి బుమ్రా ప్రదర్శనపైనే ఆధారపడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆస్టేల్రియా పేస్‌ బౌర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. బుమ్రా యాక్షన్‌ ప్రత్యేకం. అతడు రోజు మొత్తం, సిరీస్‌ అంతా ఒకేలా పేస్‌ను మెయింటేన్‌ చేయగలడు. ఇండియాకు అతడే కీలకం. బంతి కొత్తదైనా, పాతదైనా అతడు వికెట్లు తీయగలడు. బుమ్రాను త్వరగా అలిసిపోయేలా చేయాలి. అది కూడా తొలి రెండు టెస్టుల్లోనే చేయాలి. అప్పుడే ఆస్ట్రేలియా సిరీస్‌ గెలవగలదు అని హేజిల్‌వుడ్‌ అభిప్రాయపడ్డాడు. ఇండియా పేస్‌ బౌలింగ్‌ అటాక్‌ చాలా మెరుగైందని అతనన్నాడు. ఇక ఇండియా, ఆస్టేల్రియా సిరీస్‌ యాషెస్‌కు ఏమాత్రం తీసిపోదని కూడా హేజిల్‌వుడ్‌ అన్నాడు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *