తెలంగాణ లో కుల వృత్తులకు పెద్ద పీట : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ : కుల వృత్తుల అభివృధే ద్యేయం గా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం శామీర్ పేటలోని పెద్ద చెరువులో మంత్రి చేపలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వృత్తులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముదిరాజ్ కులస్తులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో 100% సబ్సిడీపై ఉచితంగా చేపలను అందిస్తుందని, ఇప్పటికే గొల్ల కురుమలకు గొర్రెలను అందించినట్లు మంత్రి తెలిపారు. కుల వృత్తులకు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మాలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, మత్స్యశాఖ అధికారులు, మండల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *