PrajaJyothi News

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించండి

వరంగల్ రూరల్ ( ప్రజాజ్యోతి ) : భారతీయ జనతా పార్టీ చేతిలో కెసిఆర్ ప్రభుత్వం పతనం కాక తప్పదని గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయంఅని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గెలుపు కోరుతూ నర్సంపేట కేంద్రంలో మాజీ శాసనసభ్యులు బిజెపి రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన పట్టభద్రుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన బండి సంజయ్ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి పార్టీ అని 2023 లో రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా అధికారంలోకి వస్తుందన్నారు. ఈనెల 14న పట్టభద్రులు వ్యక్తిగత పనులు పక్కకు పెట్టి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గెలుపుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్,కేటీఆర్ మాటల గ్యారేడి చేస్తూ కాలం వెల్ల బుచ్చుతు రాష్ట్రన్ని ముంచేస్తున్నారని, బీజేపీ ఎక్కడ ఉంది అన్న టి.ఆర్.ఎస్ కు దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రుచిచూపించారని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నారని ఎమ్మెల్సీ అంటే మేoబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ గా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రెండు స్థానాలలో ఓడిపోతామనే భయం బెంగ కేసీఆర్కు పట్టుకుందని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి

తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కష్టపడుతునని మాట తప్పితే మెడమీద నా తలకాయ్ ఉండదు అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ నోరు విప్పితే పచ్చి అబద్ధాలేనని తెలంగాణ వస్తే దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తున్నన మాట ఏమైందని, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ ఎక్కడికి పోయిందని, ఇంటికో ఉద్యోగం ఊసే లేదన్నారు, నిరుద్యోగ భృతి ఆటకెక్కిందన్నారు. ఎంతో కష్టపడి కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువత ను అయోమయానికి గురి చేసి వారి జీవితాలతో ఆడుకోవడం కేసీఆర్ కే చెల్లిందన్నారు. కేంద్రం నిధులు ఇస్తే తెలంగాణ పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం కేసీఆర్ కే చెల్లిందన్నారు రేషన్ బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే కేంద్రం 29 రూపాయలు చెల్లిస్తున్నారని. రైతు భవనాలకు,హరితహారం మొక్కలకు, గ్రామాలకు, మున్సిపాలిటీలకు కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తూ ఉంటే మోకాలడ్డు తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు నిందలు కేంద్రంపై వేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ వచ్చినాక నిర్లక్ష్యానికి గురి చేసి పీ.ఆర్.సి. ప్రకటించకపోవడం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విధులకు దూరంగా పెట్టడం వారిని అవమానిచడం కాదా అని ప్రశ్నించ్చారు. వారి చేతిలోని పెన్నూ గన్ను ఐ బుల్లెట్ రూపంలో నీ గుండెల్లో దిగే రోజు తొందర్లోనే వస్తుంది అన్నారు.

న్యాయం కోసం యుద్ధం మొదలైంది

న్యాయం కోసం ధర్మం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసంయుద్ధం మొదలైంది ఉగ్రవాదులకు అండగా ఉంటూ సంతాప దినాలు నిర్వహిస్తున్న ఎంఐఎం తో పొత్తు పెట్టుకొని హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రాముని కోసం ప్రాణాలుఅర్పించిన పార్టీ బీజేపీ పార్టీ అని, ఎనభై శాతం హిందువులు ఉన్న ఈ దేశంలో రాముని మందిరం నిర్మించుటకు ఇన్ని సంవత్సరలు ఎందుకు పట్టిందని అన్నారు.రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటాలు చేస్తుందని అందుకు ప్రజలంతా కాలసిరావలని కోరారు. ప్రశ్నించే గొంతుక అయినా బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఓటు వేస్తే మీ ఓటు వృథా అవుతుందని తెలిపారు. గెలిచిన ఆరు సంవత్సరాల కాలంలో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తన సొంత అభివృద్ధి చూసుకొని కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం తోనే సరిపోయింది అన్నారు. ఇప్పటికైనా విద్యావంతులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ప్రేమేందర్రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, పెద్ది రెడ్డి మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు, ఎడ్ల అశోక్ రెడ్డి,జటోతూ హుసేన్ నాయక్, పెద్ది రెడ్డి, సంతోష్ నాయక్, మల్యాల వినయ్ గుప్త ప్రసాద్, నర్సింహారావు, రేసు శ్రీనివాస్, బల్నే జగన్ తదితరులు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *