మంజీరాలో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఆర్మీ

మెదక్ (కొల్చారం) : మండల పరిధిలోని కిస్టాపూర్ గ్రామ శివారులోని మంజీరా నది లో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అప్పటివరకు బిక్కుబిక్కుమంటూ గడిపిన బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. కిష్టాపూర్ గ్రామ శివారులో మంజీరా నది పాయల మధ్య వ్యవసాయ క్షేత్రం ఉంది. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు వీలుగా మంజీరా నదిపై కిష్టాపూర్ శివారులో తాత్కాలికంగా ప్రైవేట్ గా బ్రిడ్జి నిర్మించారు. అయితే వ్యవసాయ క్షేత్రాన్ని బయ్యర్ కంపెనీవారు లీజుకు తీసుకొని వరి విత్తనోత్పత్తి చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం మంజీరా ఎగువ భాగంలో మండలంలో భారీ వర్షాల కారణంగా మంజీరా నది పొర్లి పొంగు తుండటం దీనికితోడు బుధవారం ఉదయం సింగూర్ ప్రాజెక్ట్ ఐదు గేట్లు ఎత్తడంతో వన దుర్గాభవని ప్రాజెక్ట్ దిగువ ప్రాంతంలోని కొల్చారం మండలంలో మంజీరా నదిపై కిష్టాపూర్ గ్రామ శివారులో నిర్మించిన బ్రిడ్జి మునిగిపోయింది.

వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన నాగరాజు, మెదక్ మండలం జనకంపల్లి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, మెదక్ పట్టణానికి చెందిన శ్రీధర్, హైదరాబాద్ చెందిన కొమురయ్య లు వ్యవసాయ క్షేత్రంలో కాపలాదారులు గా పని చేస్తున్నారు. బుధవారం కిష్టాపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య తన పశువులను తీసుకొని వ్యవసాయ క్షేత్రానికి సమీపంలోకి మేతకు తీసుకెళ్లాడు. బుధవారం సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్దాం అన్న సమయంలో బ్రిడ్జి వద్దకు రాగానే అప్పటికే సింగూర్ నీరు ఉధృతంగా రావడం బ్రిడ్జి పూర్తిగా మునిగిపోవడంతో నది దాటేందుకు వీలు లేకుండా పోయింది. ఇదే విషయాన్ని కొమురయ్య వ్యవసాయ క్షేత్రం లో పనిచేస్తున్న వ్యక్తులకు చెప్పడంతో బ్రిడ్జి దాటేందుకు వీలులేకుండా పోయింది.దీంతో కొమురయ్య ఇక నది దాటి లేమని ఆందోళనకు చెందినట్లు తెలిపారు. దీంతో కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ తిరునగరి గోదావరికి ఫోన్ ద్వారా తాము నదుల్లో చిక్కుకున్న మని సమాచారం అందించాడు.రాత్రి వ్యవసాయ క్షేత్రంలో గడపాలని ఉదయం తాను అధికారులకు సమాచారం అందించి సురక్షితంగా ఒడ్డుకు చేసేలా చర్యలు తీసుకుంటామని వారిలో ధైర్యాన్ని నింపారు.

గురువారం ఉదయం ఈ విషయాన్ని కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కు సమాచారం చేరవేశారు. నదులో చిక్కుకున్న వారితో ఎస్ఐ మాట్లాడగా ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉందామన్న తినడానికి తిండి గింజలు లేవని ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం ఇబ్బంది భయంగా ఉందని ఎలాగైనా తమను ఒడ్డుకు చేర్చారని వేడుకొన్నారు.ఎస్సై ఈ విషయాన్ని మెదక్ డిఎస్పి కృష్ణమూర్తికి సమాచారం అందించారు. మంజీరా నది లో చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న మెదక్ డిఎస్పి కృష్ణమూర్తి ఈ విషయాన్ని ఇంచార్జి జిల్లా కలెక్టర్ , సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ కు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ కు చేరవేశారు.హెలికాప్టర్ ద్వారా బాధితులను ఒడ్డుకు చేర్చగల ము అని చెప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు మూడు విడతల్లో నది లో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా హెలికాప్టర్లో ఎక్కించుకుని మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై దింపారు. బాధితులు సురక్షితంగా బయటపడడంతో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సహాయక చర్యల్లో ఆర్డిఓ సాయిరాం, మెదక్ రూరల్ సిఐ పాలవెల్లి, తసీల్దార్ ప్రదీప్, ఆర్ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *