AP minister juvvadi ratnakar rao passes away మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు

ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు గారి అంత్యక్రియలు

జగిత్యాల (ప్రజాజ్యోతి న్యూస్) : కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు (92) కన్నుమూశారు. అనారోగ్యంతో కరీంనగర్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అంత్యక్రియలను ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గోదావరి నది తీరంలో సాయంత్రం 5:30గంటలకు అంత్యక్రియలు జరిగాయి. జువ్వాడి పార్థివ దేహంవద్ద మంత్రులు టి. హరీష్ రావు, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్,టి ఆర్ ఎస్ పార్టీ పార్లమెంటరి నేత కె. కేశవరావు ,మాజీ హోం  మంత్రి జానారెడ్డి ,ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చేర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ ,జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ,ఎమ్మెల్యే లు సంజయ్ కుమార్ ,విద్యాసాగర్ రావు ,శ్రీధర్ బాబు ,తదితరులు నివాళులు అర్పించారు.

Read More From PrajaJyothi News : మిషన్ భగీరథ నీరు అందించాలి : అబ్దుల్ అజీమ్

AP minister juvvadi ratnakar rao passes away మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు
AP minister juvvadi ratnakar rao passes away మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు

Read More From PrajaJyothi News : ఆంధ్రా జల దోపిడీ ని అడ్డుకోరేం..? వంశీ చందర్ రెడ్డి

సర్పంచ్ నుండి మంత్రి వరకి

రత్నాకర్ రావు మొదట సర్పంచ్ గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967నుండి తిమ్మాపూర్ సర్పంచ్ గా 12ఏళ్ళు పని చేశారు. 1979లో జగిత్యాల బ్లాక్ సమితి అధ్యక్షులుగా పనిచేసారు. 1983లో జగిత్యాల నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభార్థిగా పోటీచేసి టిడిపి అభ్యర్థి జీవనరెడ్డి చేతులో ఓటమి పాలయ్యారు. 1989 లో బుగ్గారం సిగ్మెంట్ నుండి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి స్వాతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి రెండు ఆకుల గుర్తుపై గెలిచారు . మళ్ళి 1994 ఎన్నికలలో ఓటమిపాలైన జువ్వాడి 1999-2004 లో అసంబ్లీ ఎన్నికలలో బుగ్గారం నుండి గెలుపొందారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సి ఎం ఉన్నపుడు 2007-09 వరకు దేవాదాయ స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత 2009లో అసెంబ్లీ సిగ్మెంట్ ప్రధాన విభజన తరువాత 2009-10 అసెంబ్లీ ఎన్నికలలో కోరుట్ల సిగ్మెంట్ నుండి పోటీ చేసి ఒటమిపాలుఅయ్యారు.

Read More From PrajaJyothi News : మూగజీవాల ఆకలి తిరుస్తున్న జంతు ప్రేమికులు

సి.ఎం కె.సి.ఆర్ సంతాపం

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ మృతి పట్ల సి ఎం కె సి ఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రత్నాకర్ రావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ సి ఎస్ సోమేశ్ కుమార్ ను సి ఎం ఆదేశించారు. రత్నాకర్ రావు మృతి పట్ల కాంగ్రెస్  నేతలు సంతాపం ప్రకటించారు. సంతాపం తెలిపిన వారిలో టి పి సి సి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి ,మల్లు బట్టు విక్రమార్క , ఎం పి కోమటిరెడ్డి వెంటకరెడ్డి ,ఎమ్మెల్సీ జిమ్ జీవన్ రెడ్డి ,ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

Read More From PrajaJyothi News : PrajaJyothi News Main E-Paper Today

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *