Annadanam అన్నదానం

అన్నదానం (Annadaanam) తో ఎన్నో పుణ్య, ఫలాలు..

Annadanam Mahadanam Telugu News అన్నదానం
Annadanam Mahadanam Telugu News అన్నదానం

మానవసేవతో మాధవసేవను పొందవచ్చు. అందులో అన్నదానం కూడా ఒకటి. అసలు అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు. అన్నదానం తో ఎన్నో రెట్ల పుణ్య ఫలాలు లభిస్తాయి. ద్వేషం, అసూయ, స్వార్థం, దురాశతో ప్రజ మనస్సు తడిసిన ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు ఈ ఛాయలు కానరావడం లేదు. ప్రేమ, భక్తీ, త్యాగం, ఇంద్రియాలపై నియంత్రణ, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం వంటి పదాలు హాస్యాస్పదంగా మారాయి. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మాట్లాడే వ్యక్తులు తగ్గారు. దీనివలన వ్యక్తిగతంగా వారికి బాధలు తప్పడం లేదు. ఆధ్యాత్మిక ఆనందంతో ఉన్నవారిని బాధలు ఏవిూ చేయలేవు. భారీ బాధను సైతం వారు అవలీగా అనుభవిస్తారు. ఈ రోజుల్లో ప్రజలు సంపాదనలో పడి అలౌకికానందాన్ని కోల్పోతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం !మనలో చాలా మందికి అన్నము అంటే తెలియదు. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్దాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు.

Read More From PrajaJyothi News : విక్రం సినిమా కోసం తమిళనాడు లో మరో రష్యా సెట్టింగ్

అన్నదానం (Annadaanam) అంటే ప్రాణదానం చేయటమే..!!

అన్నదానం మాత్రమే చేయాలి కానీ అమ్మకూడదు. కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశము అని అయిదు కోశము లు ఉంటాయి. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశము, అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబందించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణ శక్తిగా మారుతున్నది. కనుక అన్నమయ కోశములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం. అంతే కాదు తైత్తిరీయోపనిషత్తులో ఆ అన్నము వలననే భూతజాతము జనించు చున్నవి, జీవులు జీవించుచున్నవి, తుదకు అన్నము నందే నశించుచున్నవి లేక లయించు చున్నవి అని చెప్పబడి ఉంది. మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది. అన్నదానం అంటే ఏమిటి ? అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే. అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావసినవన్ని అన్నమే. కనుక అన్నం దానం చేయటం ఎంతో శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తుతున్నాయి. మిగితా దానాలకు విచక్షణ అవసరం కానీ అన్నం దానం చేయటానికి మాత్రం ఈ నియమం లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే వారి ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది.

Read More From PrajaJyothi News : ఇలియానా కి ఇప్పుడు అతడే దేవుడు..!!

అన్నము దానం (Annadaanam)మహత్యం

ఈ కథలో అన్నదానం మహత్యాన్ని వివరిస్తూ.. పూర్వకాంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలు దేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. దీంతో అతనికి ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడగా, అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు అందుకు ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. దీంతో బ్రాహ్మణుడు కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు. ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది.

Read More From PrajaJyothi News : ఆ పౌడర్ ను కొబ్బరిబొండం లో కలిపి తాగితే కిడ్ని సమస్యలు రావు!

అన్నదానం (Annadaanam)మహిమ వెలకట్టలేనిది

తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. దీంతో ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం విూదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు, కాని ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి,…ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి, శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వలన ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువు మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. దీంతో బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదానం మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

Read More From PrajaJyothi News : Read Today PrajaJyothi Epaper

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *