తెలుగు టీవీ చరిత్రను తిరగరాసిన అమృతం సీరియల్
అప్పట్లో అమృతం సీరియల్ అంటే తెలుగు సీరియల్ చరిత్రలో ఓ తిరుగులేని ఘట్టం అనేవారు. తక్కువ సమయం లోనే వెలకట్టలేని గుర్తింపు సొంతం చేసుకున్న సీరియల్ ఏది అంటే అది ఖచ్చితంగా అమృతం సీరియల్ అనే చెప్పాలి. తెలుగులో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ని దేశ నలుమూలల విస్తరించి ఉన్న హింది ప్రేక్షకులు కూడా వాళ్ళకి తెలుగు భాష అర్థం కాకపోయినా కూడా చూసేవారు. గన్నం గంగారాజు గారిచే నిర్మించబడ్డ సీరియల్ తెలుగు టెలివిజన్ షో యొక్క పేరును తిరగరాసి ఒక చరిత్రను సృష్టించింది. జస్ట్ ఎల్లో అని పిలువబడే బ్యానరు పైన ఈ అమృతం అని పరిచయం అయ్యింది.
Read More From PrajaJyothi News : దేశానికి సాంకేతిక పరిజ్ఞానం పరిచయం చేసిన రాజీవ్ గాంధీ

Read More From PrajaJyothi News : ఆంధ్ర ప్రభుత్వానికి నాగబాబు వార్నింగ్
19 ఏళ్ల నాటి క్రితం ఉన్న క్రేజ్ ఇప్పటికి కూడా తగ్గలేదు
తెలుగు ఛానల్ లో అప్పుడెప్పుడో ప్రారంభమై పూర్తి అయిన ఈ అమృతం సీరియల్ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఏదో ఒక ఛానల్ లో ప్రసారం అవుతూనే ఉంది. అయితే ఈ సీరియల్ లో నటించిన వారు కూడా ఇప్పుడు ఆ సీరియల్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకొని ఉన్నారు. దాదాపు 19 సంవత్సారాల క్రితం మొదలైన ఈ అమృతం సీరియల్ యొక్క కథనం ఇంచు మించు పూర్తిగా ఓ టిఫిన్ హోటల్ చుట్టూ జరిగేది. అయితే ఈ అమృతం సీరియల్ పాట కూడా ఓ గొప్ప సంచలనమే. విబిన్నంగా ఉండే ఈ అమృతం టైటిల్ సాంగ్ కోసం చిన్నారులు కూడా ఇప్పుడు యుటుబ్ లో వెతికి మరి వింటున్నారు.
Read More From PrajaJyothi News : ప్రతి శుక్రవారం డ్రై డే చేపట్టాలి : మహబూబాబాద్ కలెక్టర్
అమృతం ద్వితియం అనే పేరుతో మళ్లీ రాబోతున్న అమృతం సీరియల్
అయితే ఇంత ప్రజాదరణ పొందిన ఈ అమృతం సీరియల్ ను పునః ప్రసారం చేయడానికి రెడీ అయ్యారు జీ తెలుగు ఛానల్ వారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని జీ తెలుగులో విడుదలకి సిద్దం అవుతున్న ఇప్పుడు కొత్తగా అమృతం ద్వితియం అనే పేరు తో మనల్ని అలరించబోతుంది. ఈ నేపధ్యంలో ఈ అమృతం ద్వితియం యొక్క ట్రైలర్ వీడియో ఈపాటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారిచే విడుదల అయ్యి సందడి చేస్తుంది. 19 ఏళ్ల క్రితం ప్రారంభమై ముగిసిన ఆ కథను అప్పటి నుండి ఇప్పటి వరకి ఈ సీరియల్ యొక్క ప్రేమికులు యుటుబ్ లో వెతికి మరి చూస్తున్నారు. ఇలా ఏది ఏమైనప్పటికీ ప్రేక్షక దేవుళ్ళ యొక్క కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేంతల నవ్వించిన ఈ సీరియల్ మళ్లీ తమ ముందుకి రావటం ఎంతో సంతోషకరం అని పలువురు చెప్తున్నారు.
Read More From PrajaJyothi News : PrajaJyothi News Today E-Paper in PDF
[…] […]