న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తోలి టెస్ట్ లో మొదటి సెషన్ మొత్తం క్రీజింగ్ లో ఉండి దాదాపు 30 ఏళ్ల తర్వాత మయాంక్ మళ్ళీ రికార్డు ని నెలకొల్పాడు. 1990 లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మనోజ్ ప్రభాకర్ తోలి సెషన్ మొత్తం బాటింగ్ చేసి క్రీజులో ఉన్నాడు. ఆ తర్వాత ఓపెనర్ గా దిగిన మయాంక్ ఈ ఘనత సాధించడం గమనార్హం. అయితే వీరిద్దరూ మినహా న్యూజిలాండ్ లో మిగతా ఏ ఒక్కరూ తోలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన దాఖలాలు లేవు.

ప్రస్తుతం టీ బ్రేక్ వరకు రహానే, రిషబ్ పంత్ లు క్రీజులో ఉన్నారు. సహచరులంతా వెనుదిరిగినప్పటికీ రహానే క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. టీ బ్రేక్ సమయానికి భారత్ 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *