యువ‌కులు వారి నిండు జీవితం నిద్ర‌మ‌త్తులోనే క‌నుమ‌రుగైపోయింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్దు ప్ర‌మాదంలో ఐదుగురు యువ‌కులు అక్క‌డిక‌క్కడే మృతిచెంద‌డం క‌లిచివేసింది. కారు అదుపుతప్పి వాటర్‌ పైపులైన్‌ను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు యువకులు మృత్యువాతపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున చింతపల్లి మండలం, ధైర్యపురి తండా సాగర్‌హైవేపై ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌నుంచి మల్లెపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న 5 గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్ర‌మాదాల‌పై ఎంత అవ‌గాహ‌న క‌ల్పించినా, ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న ఘోర‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *