వెలుగులోకి ఎన్‌ఎస్‌ఎఫ్‌ అక్రమ కబ్జాలు... ‘‘ప్రజాజ్యోతి’’ కథనానికి స్పందించిన అధికారులు... 12 ప్లాట్లు కబ్జా, రిజిస్ట్రేషన్లు... నకిలీ పత్రాలతోనే రిజిస్ట్రేషన్లు... జిల్లా కలెక్టర్‌, కోర్‌ కమిటీకి నివేదిక...

Submitted by SANJEEVAIAH on Sat, 17/02/2024 - 08:50
sarve

వెలుగులోకి ఎన్‌ఎస్‌ఎఫ్‌ అక్రమ కబ్జాలు

‘‘ప్రజాజ్యోతి’’ కథనానికి స్పందించిన అధికారులు

12 ప్లాట్లు కబ్జా, రిజిస్ట్రేషన్లు

నకిలీ పత్రాలతోనే రిజిస్ట్రేషన్లు

జిల్లా కలెక్టర్‌, కోర్‌ కమిటీకి నివేదిక

రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ

(నిజామాబాద్‌ బ్యూరో - ప్రజాజ్యోతి - ఏడ్ల సంజీవ్‌)

బోధన్‌లోని ఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్లాట్ల మాయజాలం వెలుగులోకి వచ్చింది. నకీలీ పత్రాలతో ఏకంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్మికులకు చెందాల్సిన ప్లాట్లను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయడం విశేషం. శుక్రవారం ‘‘ప్రజాజ్యోతి’’ దినపత్రికలో ‘‘ఎన్‌ఎస్‌ఎఫ్‌ స్థలాలు హాంఫట్‌’’ కథనం ప్రచురితం అయింది. దీనిపై స్పందించిన ఎన్‌ఎస్‌ఎఫ్‌ కోర్‌ కమిటీ సభ్యులు, ఇంచార్జి అధికారి విశ్వనాధం శుక్రవారం విచారణ చేపట్టారు. బోధన్‌ మండలం ఫాండుఫారం శివారులోని ఎన్‌ఎస్‌ఎఫ్‌ స్థలాలను పరిశీలించారు. ఎనిమిది బ్లాక్‌లలో జీరో ప్లాట్లుగా ఉన్న 77 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిపై కన్నెసిన వారు 2003 నుంచి 2012 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లను సైతం గుర్తించారు. వీటిలో 12 ప్లాట్లు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. వీటీని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కబ్జా చేసుకోవడమే కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన కోర్‌ కమిటీ అధికారులు అసలు విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. 

 

ప్లాట్లు మాయం...

 

బోధన్‌ మండలం ఫాండుఫారం శివారులోని ఎనిమిది బ్లాక్లులో ఉన్న 12 ప్లాట్లను కబ్జా చేసుకోని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ‘‘ఏ’’ బ్లాక్‌లో 38 ప్లాట్లు ఉండగా వాటిలో రెండు ప్లాట్లు కబ్జా చేసుకున్నారు. ప్లాట్‌ నంబరు 59, 86 ప్లాట్లు, ‘‘బి’’ బ్లాక్‌లో 9 ప్లాట్లు ఉండగా మూడు ప్లాట్లు మాయం అయ్యాయి. 11, 71, 146 ప్లాట్‌ నంబర్లను రిజిస్ట్రేషన్లు చేసారు. ‘‘సి’’ బ్లాక్‌లో 14 ప్లాట్లు ఉండగా అయిదు ప్లాట్లు అక్రమంగా కబ్జాకు గురయ్యాయి. వీటి నంబర్లు 20, 49, 88, 117, 244 ప్లాట్లు తప్పుడు పత్రాలతో అమ్మకాలు జరిపారు. ‘‘ఈ’’ బ్లాక్లులో 8 ప్లాట్లు ఉండగా 94వ నంబర్‌ ప్లాట్‌ కబ్జాకు గురి అయింది. అలాగే ‘‘ఎఫ్‌’’ బ్లాక్‌లో 133వ ప్లాట్‌ కబ్జా చేసుకోని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇలా ఎనిమిది బ్లాకులలోని 77 ప్లాట్లలో 12 ప్లాట్లు కబ్జా చేసుకోని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.

 ఏం జరిగింది... ఏలా జరిగింది..?


ఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్లాట్లు మాయం కావడం వెనుక ఓ దళిత నాయకుడు, మరో బిఅర్‌ఎస్‌ నాయకుడి పాత్ర ఉన్నట్లు దాదాపుగా రుడి అయింది. ఏలాంటి కెటాయింపులు లేకున్నప్పటికి నకిలీ పత్రాలను తయారు చేసి ఏకంగా రిజిస్ట్రేషన్లు చేయించి ఇతరులకు అమ్మకాలు జరిపారు. 2003 నుంచి 2012 వరకు జరిగిన ఈ తాతంగంతో పలువురికి చేతులు సైతం మారాయి. అయితే వీటిలో రెవెన్యూ శాఖ నుంచి తప్పుడు పత్రాలు తయారు చేసి రిజిస్ట్రేషన్లు చేయడం, మరోపక్క మున్సిపాలలిటీ నుంచి ఇంటి నంబరు తీసుకొని అ ఇంటి నంబరు ప్రకారం రిజిస్రేషన్‌ చేసినట్లుగా గుర్తించారు. ఇలా పలువిధాలుగా ఎన్‌ఎస్‌ఎఫ్‌ స్థలాలను కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరి, ముగ్గురికి చేతులు మారినట్లు తెలుస్తుంది. 2015 తర్వాత ఎన్‌ఎస్‌ఎఫ్‌ భూముల లావాదేవిలు, రిజిస్ట్రేషన్లు నిలిపివేసారు. అయినప్పటికి పాత నంబర్లకు ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయించారు. వీటిలో శక్కర్‌నగర్‌ కాలనీతో పాటు అచన్‌పల్లి శివారులోని స్థలాలు ఉన్నట్లు సమాచారం. దీంట్లో రిజిస్ట్రేషన్‌ శాఖలోని సబ్‌ రిజిస్ట్రార్ల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా బోధన్‌లోని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా స్థలాలకబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీటిని అత్యధిక రేటుకు ఇతరులకు అమ్ముకున్నారు. వీటిపై గత పదేళ్లుగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రజాజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన కోర్‌ కమిటీ ఇంచార్జి అధికారి విశ్వనాధం అక్రమ కబ్జాలపై విచారణ చేపట్టారు. ఇప్పటికే ఫాండుపార్లంలోని 12 ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లను వెలుగులోకి తీసుకువచ్చారు. 

చర్యలు తప్పవు.. : ఇంచార్జి అధికారి విశ్వనాధం

ఎన్‌ఎస్‌ఎఫ్‌ స్థలాలపై విచారణ చేస్తున్నాం. ఇప్పటికే పలుచోట్ల కబ్జాలు జరిగినట్లు గుర్తించాం. వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. దీనిపై నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ మనుమంత్‌కు, ఎన్‌ఎస్‌ఎఫ్‌ కోర్‌ కమిటీకి నివేదిక ఇస్తారు. ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే బోధన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు సైతం రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్‌ఎస్‌ఎఫ్‌ స్థలాలకు సంబంధించిన ఏలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని వాటి వివరాలను తెలియజేసాం. అయితే ఇప్పటి వరకు జరిగిన కబ్జాలు, రిజిస్ట్రేషన్లు 2012 వరకు మాత్రమే జరిగాయి. వాటిపై విచారణ చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తాం. ఎవరైనా ఎన్‌ఎస్‌ఎఫ్‌ భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు చేస్తామని చెపితే నమ్మవద్దని కోర్‌ కమిటీ ఇంచార్జి అధికారి విశ్వనాధం తెలిపారు.