తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాళన్ (18) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విశ్వ మరో ఐదుగురు కలిసి 83వ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు గౌహతి నుండి షిల్లాంగ్‌కు కారులో వెళ్తుండగా ఈ ఘోరం సంభవించింది. ఈ ప్రమాదంలో విశ్వతో పాటు కారు డ్రైవర్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదలగా, మిగతా ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న దీన్ దయాళ్ దుర్మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు..అలాగే పలువురు క్రీడాకారులు సంతాపం ప్రకటించారు..