Thursday, May 26, 2022

“పోలీస్ నేస్తం” కార్యక్రమాలతో ప్రజలతో మమేకం -జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

ఇల్లంతకుంట, మే 13, (ప్రజాజ్యోతి): ఇల్లంతకుంట మండలంలోని తెనుగువానిపల్లె (మెళ్లాచేరువు) గ్రామామంలో ఏర్పాటు చేసిన పోలీస్ నేస్తం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, గ్రామంలో ఉన్న సమస్యలు (దొంగతనాలు,రోడ్ అసిడెంట్స్,బస్ సౌకర్యం,సీసీ కెమెరాల ఏర్పాటు,గ్రామంలో ఉన్న అసంగీక కార్యకలాపాలు,)అదేవిధంగా వారి అభిప్రాయాలు సూచనలు, సలహాలు తీసుకొని వాటి పైన ప్రత్యేక మైన దృష్టి పెట్టి తమపరిధిలోని సమస్యలను పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అని అన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…
పోలీస్ నేస్తం అనే కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలతో మమేకం కావడం జరిగింది అని గ్రామ ప్రజల దగ్గరి నుండి వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలు వారి గ్రామంలో ఉన్న సమస్యలు చెప్పుకోవడం జరుగింది అని అన్నారు. అదేవిధంగా ప్రజలకు రోడ్ భద్రత,ట్రాఫిక్ రూల్స్,సీసీ కెమెరాల ఉపయోగం,సైబర్ నేరాలు(1930),సోషల్ మీడియా,గల్ఫ్ సమస్యలు,డయల్ 100,షీ టీమ్స్* మొదలగు అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలకు ఎలాంటి ఆపద వచ్చిన జిల్లా షీ టీం నెంబర్ (7901132141) కు కంప్లీట్ చేయవచ్చని, ఇది మహిళ ఎస్.ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉంటుందని అన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో అనవసర పోస్ట్ లు పెట్టకూడదని, వాట్స్ అప్ గ్రూపులలో వచ్చే మెసేజ్ లు ఇతరులకు పంపకుడదాని అన్నారు. జిల్లాలో సోషల్ మీడియా సెల్ (వాట్స్ అప్ నెంబర్ (6303922572) ఉందని దీని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని , పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి అని అన్నారు. ఎవరు కూడా సమయం వృధా చేసుకోకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తీసుకోవాలని తెలిపారు.
అదేవిధముగా పోలీస్ నేస్తం ప్రోగ్రాంలో భాగంగా ప్రతి గ్రామంలో వాట్స్ అప్ గ్రూప్ కు ఏర్పాటు చేయడం జరిగింది అని, ఇందులో గ్రామాల ప్రజలు విలేజ్ పోలీస్ అధికారి, ఎస్ఐ, సిఐ పోలీస్ కంట్రోల్ నెంబర్ ఉంటుందని అన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న వాట్స్ అప్ ద్వారా చెప్పాలని, అది విలేజ్ పోలీస్ అధికారి ఎస్ఐ, సిఐ, డిఎస్పీ పోలీస్ కంట్రోల్ అధికారికి కమ్యూనికేట్ చేస్తాడు అని అన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ పర్యవేక్షణకు ఒక సెపరేట్ టీం ఉంటుందని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ ఉపేందర్, ఎస్ఐ మహేందర్,లక్ష్మారెడ్డి,గ్రామ సర్పంచ్ ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles