Monday, January 17, 2022

సిరీస్ స‌మ‌ర్ప‌యామి…ప్రోటోస్ చేతిలో భార‌త్ ఓట‌మి…

కేప్ టౌన్ – విదేశీ గ‌డ్డ‌పై భార‌త్ మ‌రోసారి సిరీస్ ను పొగొట్టుకుంది… బౌన్సీ పిచ్ ల‌పై బ్యాట‌ర్లు చేతులెత్తేయ‌డంతో భార‌త్ సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగో రోజు లంచ్ ముగిసిన వెంటనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. బుమ్రా, షమీ, శార్దూల్, ఉమేష్ యాదవ్, అశ్విన్ వైఫ‌ల్యం నిరాశ క‌లిగించింది.. స‌ఫారీ బ్యాట‌ర్ కె.పీటర్సన్ మరోసారి అద్భుత్ ఫామ్‌ను కనపరిచాడు.ఈ టెస్ట్ లో పీటర్సన్ (82), డస్సెన్ (41 నాటౌట్), బవుమా (32 నాటౌట్) కలిసి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చారు. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడినా అద్భుతంగా పుంజుకుని జోహన్నెస్ బర్గ్, కేప్‌ టౌన్‌ టెస్టులలో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించి టెస్టు సిరీస్‌ను సాధించింది.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles