Monday, January 17, 2022

సారీ సైనా…ఇట్స్ ఓకే సిద్ధార్ధ్…

చెన్నై,జనవరి12(ఆర్‌ఎన్‌ఎ): సినీహీరో సిద్దార్థ్‌ సోషల్‌ విూడియా వేదికగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌పై చేసిన ఓ కామెంట్‌ పెద్ద దుమారమే రేగింది.. ప్రధాని పంజాబ్‌ పర్యటనలో చోటుచేకున్న భద్రతాలోపాన్ని ప్రస్తావించిన సైనా.. దేశ ప్రధానికే భద్రత లేకపోతే.. ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం ప్రధాని వెూడీపై అరాచకవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.. అయితే, సైనా ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. చిన్న కాకతోే ఆడే ప్రపంచ ఛాంపియన్‌..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడటానికి కొందరు రక్షకులు ఉన్నారు.. అంటూ కామెంట్‌ చేయడంతో అసలు వివాదం మొదలైంది.. జాతీయ మహిళా కమిషన్‌, కొందరు ప్రముఖులు, చివరకు సైనా తండ్రి హర్వీర్‌సింగ్‌ నెహ్వాల్‌ కూడా సిద్దార్థ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు.. ఈ నేపథ్యంలో బహిరంగంగా సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెప్పారు
హీరో సిద్దార్థ్‌.. సైనా నెహ్వాల్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు హీరో సిద్దార్థ్‌.. తాను ఎవరినీ అగౌరవపరిచ లేదని చెప్పే ప్రయత్నం చేసిన సిద్దార్థ్‌.. సైనా నెహ్వాల్‌ పెట్టిన ట్వీట్‌ విూద తాను రియాక్ట అవుతూ చేసిన ఆ కామెంట్‌.. ఒక జోక మాత్రమే నంటూ తన లేఖలో పేర్కొన్నాడు.. కాకపోతే తాను చేసిన ఆ కామెంట్‌ చాలా మందిని బాధించిందని, మహిళలను కించపరుస్తూ కామెంట్స్‌ చేయాలనే ఉద్దేశంతో మాత్రం అలా చేయలేదని సిద్దార్థ్‌ వివరణ ఇచ్చుకున్నాడు.. సైనా నెహ్వాల్‌ ఓ గొప్ప క్రీడాకారిణి, ఆమెను ఎపðడూ గౌరవిస్తానని పేర్కొన్నాడు.. నువ్వు ఎపðడూ నాకు ఛాంపియన్‌గా ఉంటావు’ అని రాసుకొచ్చాడు సిద్దార్థ్‌..

సిద్దార్థ్ క్షమాపణలు చెప్పడంతో సైనా రిప్లై ఇచ్చింది. ‘‘ అతడే ట్విట్టర్‌లో ఆ విధంగా అన్నారు. ప్రస్తుతం క్షమాణలు చెబుతున్నారు. సిద్దార్థ్ ట్వీట్ చేసిన రోజు నేను ట్విట్టర్‌లో ట్రెండ్ అయినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. అతడితో ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. కానీ, అతడు క్షమాపణలు చెప్పినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ ట్వీట్ మహిళకు సంబంధించినది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి వాటిని నేను పట్టించుకొను. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. దేవుని ఆశీస్సులు అతడికి ఉండాలి ’’ అని సైనా నెహ్వాల్ తెలిపింది.

సిద్ధార్థ్‌పై  కేసు నమోదు…

హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్‌ పోలీసులు సినీ నటుడు సిద్ధార్థ్‌పై  కేసు నమోదు చేశారు. ట్విటర్‌లో షట్లర్ సైనా నెహ్వాల్‌‌పై సిద్ధార్థ్ అసభ్యకర మెసేజ్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద సిద్ధార్థపై కేసు నమోదు చేశారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles