Thursday, May 26, 2022

ఎస్ఎఫ్ఐ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

ఖానాపురం :16జనవరి (ప్రజా జ్యోతి )
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం, నర్సంపేట పట్టణ కేంద్రంలో స్థానిక ఎస్ఎఫ్ఐ ఆఫీసులో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నూతన క్యాలెండర్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు భూక్యా సమ్మయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి, ముఖ్య అతిథులుగా హాజరై ఎస్ఎఫ్ఐ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది
అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ముఖ్య సమ్మయ్య మాట్లాడుతూ..ఎస్ఎఫ్ఐ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే ఆశయాల సాధన కోసం ఎంతో మంది విద్యార్థి నాయకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసి అమరులు అయినటువంటి గొప్ప చరిత్ర గలది భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అన్నారు నిరంతరం విద్యార్థి హక్కులకోసం కార్పొరేట్ విద్యా విధానానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై పోరాటాలు చేస్తూ భారతదేశంలోని అతి పెద్ద విద్యార్థి సంఘం గా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఉందన్నారు విద్యార్థి అమరవీరుల ఆశయాలతో నేడు అధికారం లో ఉన్నటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య కాషాయీకరణ, కార్పొరేటీకరణ కు వ్యతిరేకంగా అంతేకాకుండా నేడు విద్యారంగంలో కూడా కుల, మతాల తీసుకువచ్చి వారి రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేటి రాజకీయాలు ఉన్నాయన్నారు ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు బలోపేతానికి కృషి చేయాలని పిలుపు నివ్వడం జరిగింది . దిఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొమురయ్య, ఖానాపూర్ మండలం డివైఎఫ్ఐ నాయకులు పెంతల నరేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు శివరాత్రి అనిల్, ప్రశాంత్, మహేష్, రాకేష్, నాయకులు కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

- Advertisement -spot_img

Latest Articles